Hyderabad: శుభకార్యంలో రెచ్చిపోయిన హిజ్రాలు.. డబ్బులు ఇవ్వలేదని గుంపుగా దాడి
- హైదరాబాద్‌లో హిజ్రాలు దౌర్జన్యం
- ఓ శుభకార్యంలో రెచ్చిపోయిన హిజ్రాలు
- డబ్బులు ఇవ్వలేదని గుంపుగా దాడి
- ఇంటి యజమానికి తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక ఇల్లు నిర్మించాలంటే దాని వెనుక ఎంతో కష్టం.. ఎంతో శ్రమ. ఎంతో డబ్బు ఖర్చు ఉంటుంది. ఇక హైదరాబాద్‌లాంటి మహా నగరంలో ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. అనుకున్న బడ్జెట్ దాటిపోతే అప్పో.. సొప్పో చేసి మరి ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తారు. ఇలానే ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. బంధువులు.. స్నేహితులను పిలిచి గ్రాండ్‌గా గృహప్రవేశం చేశాడు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో కొత్త ఇంటిపై హిజ్రాల కన్నుపడింది. ఇల్లు కట్టుకున్నందుకు డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇవ్వలేనని చెప్పిన పాపానికి హిజ్రాల గుంపు మూకుమ్మడి దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్-కీసర పరిధిలోని చీర్యాల్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Bihar Elections: కూటమిలో జోష్.. భారీగా లడ్డూలు సిద్ధం చేస్తున్న కార్యకర్తలు
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
కీసర పరిధిలోని చీర్యాల్ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో ఇటీవల సదానందం అనే వ్యక్తి గృహ ప్రవేశం చేశాడు. ఆదివారం ఇద్దరు హిజ్రాలు వచ్చి రూ.1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు సదానందం నిరాకరించాడు. దీంతో హిజ్రాలు తిట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటికే రెండు, మూడు ఆటల్లో 15 మంది హిజ్రాల గుంపును వేసుకుని వచ్చి ఘర్షణకు దిగారు. వెళ్లిపోవాలంటూ కుటుంబ సభ్యులు సర్దిచెబుతున్నా వినకుండా కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. సదానందంపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇరుగుపొరుగు వారు గమనించి దగ్గరకు రాగానే వెంటనే అక్కడ నుంచి పారిపోయారు. కర్రలతో దాడి చేయడంతో సదానందం తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఇక ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: గోడి మీడియాను నమ్మొద్దు.. సర్వేలపై తేజస్వి యాదవ్ ధ్వజం
తాజావార్తలు
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!