Tragedy : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే యువత అమెరికా వంటి దేశాల్లో జరుగుతున్న దారుణ ఘటనలకు బలైపోతున్నారని తాజా ఉదాహరణ మరోసారి వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని డాలస్ నగరంలో కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన విద్యార్థి చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. చంద్రశేఖర్ స్వదేశంలో బీడీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. డాలస్‌లో నివాసం తీసుకొని చదువుకుంటూ, అదనంగా ఒక పెట్రోల్ బంక్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తున్నారు.…
తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) ఈ నెల 6 నుండి 20 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 100 ప్లాట్ల వేలాన్ని నిర్వహించనుంది. గత నెలలో ఈ వేలానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్ అభివృద్ధి కోసం రక్షణ శాఖ భూముల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వ తరపున ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు లేఖ రాశారు.
Alai Balai Event: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. దత్తాత్రేయ 2005లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ‘ఆపరేషన్ సింధూర్’ థీమ్‌తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి అర్జున్…
హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణానికి పునాది రాయి వేయడం జరిగింది. దసరా పర్వదినం సందర్భంగా శాస్త్రోక్త పద్ధతిలో పూజలు చేసి, ఎంఈఐఎల్ డైరెక్టర్ కె. గోవర్ధన్ రెడ్డి నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్ధి ఎవరనేది త్వరలోనే తేలనుంది. ఈ ఎన్నికకు సంబంధించి అభ్యర్ధి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది పార్టీ. సీఎం రేవంత్ నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు… మార్చి 8 న కోర్టు ఎపిసోడ్ పై చర్చించారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై చర్చ జరిగింది.…
Ramreddy Damodhar Reddy Passes Away: మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 4వ తేదీన తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ హయాంలో ఐటీశాఖ మంత్రిగా పనిచేశారు రాంరెడ్డి…
2025 దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నగర వాసులు సొంతుళ్లకు పయనమవుతున్నారు. ప్రస్తుతం బస్స్టాండ్లు అన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దసరాకి ప్రత్యేకంగా 7754 బస్సులను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసింది. జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు ఆరంఘర్, ఎల్బీ నగర్, ఉప్పల్ వంటి రద్దీ ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టాండ్లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. Also Read: TS Colleges Shut Down: దసరా…
Police Raid: హైదరాబాద్ పోలీసులు, ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (FRRO) కలిసి అక్రమంగా నివసిస్తున్న ఆఫ్రికా దేశస్తులను గుర్తించి వారిని తిరిగి వారి దేశాలకు పంపిస్తున్నారు. ఆగష్టు 14న బాకారం ప్రాంతంలో అనుమతులు లేకుండా ఆఫ్రికన్ దేశస్తులు ఒక పుట్టినరోజు పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ఫాంహౌస్‌పై దాడి చేసి మొత్తం 51 మంది విదేశీయులను గుర్తించారు. వారిలో 14 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నారు. వీరు ఉగాండా,…