Jubilee Hills Bypoll: రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. సెక్టార్ల వారీగా బూతులను విభజించి, ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టింది. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ జరిగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఈవీఎంల పంపిణీ కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను ఎస్ఈసీ పూర్తి చేయనుంది. ఇక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణలో 2600 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ రోజు రాత్రి వరకు భారీ బందోబస్తు నడుము పోలింగ్ బూత్ లకు ఈవీఎంలు చేరుకోనున్నాయి.
Read Also: Siddaramaiah: సిద్ధరామయ్యకు చుక్కెదురు..హైకమాండ్ అపాయింట్‌మెంట్ నిరాకరణ!
అలాగే, జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారి ఆర్.వీ కర్ణన్ పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రంపై డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. అలాగే, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు.. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నిక సందర్భంగా 2,400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.