తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాయి కాంగ్రెస్ శ్రేణులు. పబ్లిక్ గార్డెన్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం ఈ రోజు.. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది.. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనం అనుభవిస్తోన్న ప్రజాస్వామ్యం.. ప్రపంచఉద్యమాల చరిత్రలో…
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ కిస్మత్పూర్లో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మర్డర్ మిస్టరీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏలాంటి క్లూస్ లభించలేదని పోలీసులు తెలిపారు. యువతిని రేప్ చేసి ఆ పై హత్య చేసి దిగంబరిగా పడేశారు దుండగులు. పూర్తిగా కుళ్లిన స్థితిలో మృతదేహం గుర్తించారు. యువతి వివరాలు సేకరించే పనిలో పడ్డారు రాజేంద్రనగర్ పోలీసులు. Also Read:Fraud: చిట్టీలు వేస్తున్నారా?…
దాచి దాచి దయ్యాల పాలు చేసినట్లుగా.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు కడితే.. ఆ సొమ్ముతో పరారయ్యాడు ఓ ఘనుడు. లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయలతో పారిపోయాడు. శంషాబాద్ లో చిట్టీల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు పల్లెమోని సురేందర్. చిట్టీల పేరుతో జనాలకు కుచ్చు టోపీ పెట్టాడు. రూ. 5 కోట్లకు పైగా జనాలకు కుచ్చుటోపి పెట్టి రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా పారిపోయాడు పల్లెమోని సురేందర్. విషయం తెలుసుకున్న…
Off The Record: తెలంగాణ పొలిటికల్ ఫోకస్ మొత్తం ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపు మళ్ళుతోంది. ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో… హోరా హోరీగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి ప్రధాన రాజకీయపక్షాలు. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా రాకముందే పొలిటికల్ వార్ మొదలైపోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలని కాంగ్రెస్, సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకోవాల్సిందేనన్న కసితో బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరోవైపు ఈసారి రాష్ట్రంలో…
Cyber Fraud: సైబర్ రాబరీ.. ఇప్పుడిదో స్మార్ట్ దోపిడీ. జస్ట్ ఒక్క లింక్.. లేదా ఒక్క ఫోన్ కాల్.. నమ్మారో అంతే..!! ఉన్నదంతా ఊడ్చేస్తారు..!! ఖాతాలో సొమ్ము అంతా ఖాళీ చేసేస్తారు..!! ఇలాంటి మోసమే హైదరాబాద్లో జరిగింది. తాజాగా ఓ వ్యక్తి బల్క్ వస్తువులు తక్కువ ధరకే వస్తున్నాయని నమ్మి.. సైబర్ క్రిమినల్స్ చేతిలో నిండా మోసపోయాడు. Medha School Drugs: మేధా స్కూల్ లో ఏం జరుగుతోంది? మత్తు మందును కరస్పాండెంట్ ఎలా తయారు చేశాడు?…
Medha School Drugs: మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో అసలు ఏం జరుగుతోంది? సీనియర్ కెమిస్ట్రీలు తయారు చేయలేని రీతిలో మత్తు మందును ఓ స్కూల్ కరస్పాండెంట్ ఎలా తయారు చేశాడు? ప్రతినిత్యం కిలో చొప్పున మత్తుమందును తయారుచేసి కల్లు డిపోలకి సరఫరా చేస్తున్న జయప్రకాష్ గౌడ్ రిమాండ్ రిపోర్టులో ఏముంది? సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో ఆల్ఫ్రాజోలం తయారీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల్ఫ్రాజోలం తయారు చేసేందుకు మేధా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాశ్…
Zepto: హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లిలో జెప్టో (Zepto) డెలివరీ బాయ్స్ వీరంగం సృష్టించారు. ఒక కస్టమర్పై మూకుమ్మడి దాడికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ACB Raids: కుప్పలు.. కుప్పలుగా నోట్ల కట్టలు.. భారీగా అక్రమాస్తులు గుర్తింపు! చిక్కడపల్లిలోని అంబేద్కర్ బస్తీకి చెందిన సందీప్ అనే కస్టమర్ జెప్టోలో పెన్సిల్ కిట్, పెరుగు ప్యాకెట్ను ప్రీపెయిడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్…
Kishan Reddy: కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని టీ-హబ్లో నిర్వహించిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM) ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ సెమినార్లో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగించారు. పరిశోధనలు, ఎంటర్ప్రెన్యూర్షిప్కు హైదరాబాద్ అనువైన నగరమని.. ఇది సృజనాత్మకతకు, శాస్త్ర, సాంకేతిక రంగాలకు హబ్ లాంటిదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, ఉత్పత్తుల సరఫరాలో ఇబ్బందుల నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానం యొక్క ప్రాముఖ్యత పెరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. 2030 నాటికి EV…
Hyderabad: హైదరాబాద్లోని రాజేంద్రనగర్ కిస్మత్పూర్లో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉండడంతో హత్య జరిగి రెండు మూడు రోజులు అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. Kishkindhapuri: అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్! మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కిస్మత్పూర్ బ్రిడ్జి కింద మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే…
పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా కారు అదుపుతప్పి పల్టీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి సౌమ్యా రెడ్డి మృతి చెందారు.. మరో ఏడుగురు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి.. ఇన్ఫోసిస్ ఉద్యోగం చేస్తున్న అందరు సరళమైసమ్మ టెంపుల్ వెళ్ళి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. బొంగుళూరు గేట్ నుండి పోచారం వైపు వెళుతుండగా ఇన్నోవా పల్టీ కొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి…