Jubilee Hills by-election: ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది.. సమీప ప్రత్యర్థి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీతా గోపినాథ్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యదవ్.. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్ యాదవ్.. అయితే, ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆధిక్యంలోనూ కొనసాగారు నవీన్ యాదవ్.. పోస్ట్ బ్యాలెట్లు మొదలు కొని.. ప్రతీ రౌండ్‌లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ.. తన మెజార్టీని పెంచుకుంటూ ముందుకు సాగారు.. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు.. కౌంటింగ్ మధ్యలోనూ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు దీపక్ రెడ్డి..
Read Also: Bihar Election Results: బీహార్‌లో “ని-మో” జోడి ప్రభంజనం.. అండగా నిలిచిన మహిళలు..
తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 8,911 ఓట్లు రాగా.. బీఆర్ఎస్‌కు 8,864 ఓట్లు వచ్చాయి.. దీంతో, తొలి రౌండ్‌లో 47 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేసినట్టు అయ్యింది.. ఇక, రెండో రౌండ్‌లో కాంగ్రెస్ లీడ్ 2,948 ఓట్లకు చేరింది.. మూడో రౌండ్‌లోనే కాంగ్రెస్‌కు 2,999 ఓట్ల ఆధిక్యం లభించడంతో.. మడో రౌండ్ పూర్తి అయ్యే సరికి హస్తం పార్టీ 6,012 ఆధిక్యంలోకి వెళ్లింది.. నాల్గో రౌండ్‌లో 3,547 ఓట్ల ఆధిక్యం లభించడంతో.. ఆ రౌండ్ కంప్లీట్ అయ్యే సరికి మొత్తం లీడ్ 9,559కి పెరిగింది.. ఇక, ఐదో రౌండ్‌లో 3,300 ఓట్ల ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ రౌండ్ పూర్తి అయ్యే సరికి మొత్తం 12,857 ఓట్ల లీడ్‌లోకి దూసుకెళ్లారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. మరోవైపు, ఆరో రౌండ్‌లో 2,938 ఓట్ల ఆధిక్యం, ఏడో రౌండ్‌లో 4,000 ఓట్ల ఆధిక్యంతో.. ఏడు రౌండ్లు పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్ ఆధిక్యం 19,797 వేలకు చేరింది.. ఎనిమిదో రౌండ్‌లో కూడా ఆధిక్యం దక్కడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం 20 వేల మార్క్‌ను దాటేసి.. 21,672కి చేరుకుంది.. తొమ్మిదో రౌండ్‌లో కూడా ఆధిక్యం పెరిగిన నేపథ్యంలో.. కాంగ్రెస్ అభ్యర్థికి 23,921 ఆధిక్యం లభించింది.. ఇక, చివరిదైన పదో రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరిచింది.. దీంతో, 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ ఘన విజయం సాధించారు.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌పై నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ కొట్టగా.. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి డిపాజిట్ గల్లంతు అయ్యింది..