BJP v/s TRS in Huzurabad: హుజూరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ బహిరంగ చర్చల సవాళ్ల నేపథ్యంలో కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయితే.. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి సవాల్ విసిరారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, దీంతో.. ఓ భారీ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో.. బీజేపీ కూడా తగ్గేదేలే అంటూ పోటా పోటీగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు. కాగా.. ఎక్కడైతే బహిరంగ…
మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళసై తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయాలు గవర్నర్ కు ఏం సంబంధమంటూ ప్రశ్నించారు. ఈ ఒక్క మాట చాలు గవర్నర్ బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి అని ఆరోపించారు. సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో నిరుపేదల ఆరోగ్యానికి మంజూరైన రూ.55లక్షల 29 వేల 500 విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 115 మంది లబ్ధిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేసారు. read also: CM Jagan…
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి గవర్నర్ ఎవరు? అంటూ ప్రశ్నించారు. గతంలో గవర్నర్లు హుందాగా ప్రవర్తించే వారని, క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి గవర్నర్ ఏమైనా శాస్త్ర వేత్తనా అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్ పై బాల్క సుమన్ మండిపడ్డారు. వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రిగా చేసింది…
బీజేపీ లో ఈటెల రాజేందర్ ది బానిస బతుకు బతుకుతున్నాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రిగా చేసింది కేసీఆర్ యే అంటూ గుర్తు చేసారు. ఈటెల విశ్వాస ఘాతకుడు, తిన్నింటి వాసాలను లెక్క బెట్టారంటూ మండిపడ్డారు. ఆరోగ్య మంత్రిగా.. ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. కమ్యూనిస్టు కమ్యునలిస్టుగా మారాడని విమర్శించారు. హుజూరా బాద్ లో ఈటెల ఓటమి ఖాయమని స్పష్టం…
ఆ నాయకుడు బీజేపీలో కొత్త సంప్రదాయానికి తెర లేపారా? వచ్చే ఎన్నికల్లో పలానా చోటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంలో ఆంతర్యం ఏంటి? అధిష్ఠానం చెప్పిందా.. లేక ఆయనే అడ్వాన్స్ అయ్యారా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీలో ఎంతటి పెద్దవాళ్లయినా సరే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుంది. ఆ అధికారం రాష్ట్ర పార్టీ చేతిలో కూడా ఉండదు. అందుకే ఈ విషయంలో బీజేపీ నేతలు ఎవరూ…
హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో ఓ రేంజ్‌లో రాజకీయ వేడి రాజేసింది. అక్కడ ఫలితం వచ్చాక చర్చ అటువైపు వెళ్లలేదు. ఓటమిని లైట్ తీసుకున్నట్టుగా టీఆర్‌ఎస్ కనిపించింది. అయితే హుజురాబాద్ రాజకీయ క్షేత్రంలో కీలక నియోజకవర్గంగా మారిపోయింది. ఉపఎన్నికలో గుర్తించిన పొరపాట్లు రిపీట్ కాకుండా.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అక్కడ ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం అధికార పార్టీలో ఇద్దరు నేతలు ఉన్నారు. ఒకరు ఉపఎన్నికలో ఓడిన గెల్లు శ్రీనివాస్ కాగా.. రెండో వ్యక్తి హుజురాబాద్…
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే దళిత బంధుపై కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ త్వరలోనే దళిత బంధు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే లక్ష్యమని కేసీఆర్ అన్నారు. దళిత బంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని, హుజురాబాద్తో పాటు…