Balka Suman: క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి గవర్నర్ ఏమైనా శాస్త్ర వేత్తనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి గవర్నర్ ఎవరు? అంటూ ప్రశ్నించారు. గతంలో గవర్నర్లు హుందాగా ప్రవర్తించే వారని, క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి గవర్నర్ ఏమైనా శాస్త్ర వేత్తనా అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్ పై బాల్క సుమన్ మండిపడ్డారు. వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రిగా చేసింది కేసీఆర్ యే అంటూ గుర్తు చేసారు. ఈటెల విశ్వాస ఘాతకుడు, తిన్నింటి వాసాలను లెక్క బెట్టారంటూ మండిపడ్డారు. ఆరోగ్య మంత్రిగా.. ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. కమ్యూనిస్టు కమ్యునలిస్టుగా మారాడని విమర్శించారు. హుజూరా బాద్ లో ఈటెల ఓటమి ఖాయమని స్పష్టం చేసారు. అందుకే గజ్వెల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని మండిపడ్డారు.
read also: Balka Suman: బీజేపీలో ఈటెలది బానిస బతుకు
Also Read
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
బీసీ, ఎస్సిల భూములు కబ్జా చేసిన నీఛ చరిత్ర ఈటెల ది అంటూ ఎద్దేవ చేసారు. ఈటెల చిట్టాను బయటకు తెస్తాం అంటూ సపథం చేసారు. కబ్జా చేసిన భూములను పేదలకు పంచుతామని వ్యాఖ్యానించారు. ఈటెల ఎగిరెగిరి మాట్లాడుతున్నారు ..నోరు జాగ్రత్త అని హెచ్చరించారు. ఈటెల దమ్ముంటే మళ్ళీ హుజురాబాద్ లోనే పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఒడిపోతాననే తెలిసి ఈటెల కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. హుజురాబాద్ లో మొన్న ఈటెల.. కాంగ్రెస్, రేవంత్ ల సాయంతో గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈటెల ఎక్కువగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఆయన నాలుక చీరేస్తారని హెచ్చారించారు. 20 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఈటెల అంటున్నారు, కనీసం వార్డు మెంబర్ కూడా టచ్ లో లేరని బాల్కసుమన్ విమర్శించారు. రాబోయే రోజుల్లో బీజేపీ నుంచే టీఆర్ఎస్ లో చేరికలుంటాయని సంచలన వ్యాఖ్యలు చేసారు సుమన్. కేసీఆర్ గజ్వెల్ లో ఈసారి పోటీ చేయనని ఎవరికి చెప్పారు అంటూ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!