తెలంగాణలో జరిగిన ఒక ఉప ఎన్నిక జాతీయ పార్టీ కాంగ్రెస్ ని కుదిపేస్తోంది. పార్టీ పరాజయం నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గత నెల 30 జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి అక్కడ డిపాజిట్లు గల్లంతయ్యాయి. పార్టీ పరువు పోయిందని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలు సైతం ఎన్నికల ఫలితాల తర్వాత పోస్టుమార్టం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వెయ్యం…
తెలంగాణలోని హుజురాబాద్ బైపోల్ మినీయుద్ధాన్నే తలపించింది. ఈ హోరాహోరి పోరులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈ నెల రెండున హుజురాబాద్ ఫలితం టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రావడంతో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఈ ఎన్నికకు అసలు ప్రాధాన్యతే లేదని వ్యాఖ్యనించారు. ఇదిలా ఉంటే తాజాగా టీఆర్‌ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్ హుజురాబాద్ ఫలితాన్ని రెఫరెండంగా భావించడం లేదన్నారు. ఈ 20 ఏళ్లలో టీఆర్‌ఎస్ ఎన్నో గెలుపు ఓటములను చూసిందని చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసాయని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ను ఎదురుకునే సత్తాలేక బీజేపీ… కాంగ్రెస్ ను కలుపుకుందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పై ఈటెల రాజేందర్ ఒప్పుకున్నారని… ఢిల్లీలో శత్రువులు- రాష్ట్రంలో మిత్రులుగా పనిచేయడం సిగ్గుచేటని ఆగ్రహించారు. RRR అంటే రాజాసింగ్- రఘునందన్ రావు- రేవంత్…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు నిన్నటి రోజున వెలువడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ నడిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. టీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చినా విజయం సాధించలేకపోయింది. అయితే, ఈ ఎన్నికల్లో అందరికంటే భారీగా నష్టపోయింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 3012 ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకొవచ్చు. 2018 లో జరిగిన…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో హుజూరాబాద్‌లో కేసీఆర్‌కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఒక ఉప ఎన్నిక కోసం రూ.వేల కోట్లు ఖర్చుపెట్టిన కేసీఆర్‌కు చెంపచెల్లుమనేలా ఓటర్లు తీర్పు ఇచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు బానిసలు కాదని.. ఉద్యమకారులని ఈ ఎన్నిక ద్వారా నిరూపించారని షర్మిల కొనియాడారు. కేసీఆర్ గారడీ మాటలు, పిట్టకథలు జనం నమ్మరని… ఇకనైనా…
హుజురాబాద్ లో టీఆర్ఎస్ దే నైతిక విజయం అని ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి నన్ను ఓడించాయన్నారు. ఓటమికి నేనే నైతిక బాధ్యత వహిస్తున్నానని ప్రకటించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ఈ ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ కు అభినందనలు తెలిపారు. ఇక, దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోరాడుతాయి… కానీ, హుజురాబాద్ మాత్రం కలసి పని చేస్తాయని…
తెలంగాణలో ఉత్కంఠరేపిన హుజురాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది.. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది.. ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అనూహ్యంగా ఓట్లు పోల్ అయ్యాయి.. రౌండ్ రౌండ్‌కి మెజార్టీ పెరిగింది. ప్రతీ రౌండ్‌లోనూ వెయ్యి ఓట్లకు పైగా మెజార్టీలో నిలిచారాయన.. ఫైనల్‌గా చివరి రౌండ్ పూర్తయ్యే సరికి ఈటల రాజేందర్.. తన ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్…
హుజురాబాద్ లో బీజేపీ విజయం ప్రజల విజయం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు నీతికి, న్యాయానికి మద్దతుగా నిలిచారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ కి మద్దతు ఇచ్చిన హుజురాబాద్ ప్రజానీకానికి, నా తరపున కేంద్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు. ఖర్చుతో కూడుకున్న ఎన్నికల్లో పాలక పార్టీ మభ్యపెట్టినా, వాటిని లెక్క చేయకుండా ప్రజలు బీజేపీ కి ఓటు వేసి గెలిపించారు. హుజురాబాద్ ప్రజలు చరిత్ర తీరగరాశారు.…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 24 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక, ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆది నుంచి అన్నీ తానై నడించారు హరీష్‌రావు.. నోటిఫికేషన్ వెలువడకముందు నుంచి ఆ నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేశారు.. కానీ, విజయాన్ని అందుకోలేకపోయారు. ఇక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితంపై స్పందించిన…
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం 22వ రౌండ్ లో కూడా బీజేపీ హవా… బీజేపీ 1,07,022 ఓట్లు, టీఆర్ఎస్ 83,167 ఓట్లు. 23,855 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన ఈటల 21వ రౌండ్ లోనూ బీజేపీ హవా. బీజేపీ 1,01,732 ఓట్లు, టీఆర్ఎస్ 78,997 ఓట్లు. 21వ రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 22,735 ఓట్ల ఆధిక్యం. 20వ రౌండ్ లోనూ బీజేపీ హవా… 20వ రౌండ్ లో బీజేపీ కి 1,474 ఓట్ల ఆధిక్యం…