బీఆర్ఎస్ హుజూరాబాద్ లో ఒక సైకోను ఎమ్మెల్సీ గా చేసిందని విమర్శించాడు. కులంమతం చూడకుండా అన్ని వర్గాలపై బెదిరింపులకు, కిడ్నాప్ లకు పాల్పడుతుంటే సీపీకి ఫిర్యాదు చేశాము అని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల ప్రతిపక్ష నాయకులపై జరిగుతున్న దాడులను అరికట్టాలి అని ఈటల రాజేందర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ పాలనాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు అక్కడ ఇన్ చార్జిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ ను తప్పించి పాడి కౌశిక్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.
అధికారపక్షం ఆగడాలు శృతిమించాయని.. ఈఅరాచకం ఎక్కువ రోజులు చెల్లదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణలో తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను బీఆర్‌ఎస్ నేతలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని ఆరోపించారు.
మునుగోడు ఎన్నికల గుర్తులపై టీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అత్యవసర విచారణకు నిరాకరించిన హైకోర్ట్.. నేడు విచారణ జరుపుతామని చెప్పింది.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య మూడు.. ఆ పార్టీ శ్రేణులు వారిని ఆర్‌ఆర్ఆర్‌గా పిల్చుకుంటున్నారు… రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.. అయితే, తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించి.. రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచి రఘునందన్‌రావు, హుజురాబాద్ బైపోల్‌లో నెగ్గి ఈటల రాజేందర్ సభలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, అప్పడికే పార్టీలో సీనియర్…