మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళసై తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయాలు గవర్నర్ కు ఏం సంబంధమంటూ ప్రశ్నించారు. ఈ ఒక్క మాట చాలు గవర్నర్ బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి అని ఆరోపించారు. సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో నిరుపేదల ఆరోగ్యానికి మంజూరైన రూ.55లక్షల 29 వేల 500 విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 115 మంది లబ్ధిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేసారు.
read also: CM Jagan Mohan Reddy: నాది ప్రచార ఆర్భాటం కాదు.. వరద బాధితులకు న్యాయం చేస్తాం
ఈసందర్భంగా మాట్లాడుతూ.. గవర్నర్ రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నానని మరచినట్టున్నారని ఎద్దేవ చేసారు. బీజేపీ కార్యకర్తలు చేసే కామెంట్స్ కూడా, గవర్నర్ నోటి వెంట రావడం విడ్డూరంగా వుందని మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయాలు గవర్నర్ కు ఏం సంబంధమని, ఈ ఒక్క మాట చాలు గవర్నర్ బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మీడియాలో ఎట్రాక్షన్ కోసం పోటీలు పడి మరీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇక బీజేపీ లో ఈటెల రాజేందర్ ది బానిస బతుకు బతుకుతున్నాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించిన విషయం తెలిసిందే.. వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రిగా చేసింది కేసీఆర్ యే అంటూ గుర్తు చేసారు. ఈటెల విశ్వాస ఘాతకుడు, తిన్నింటి వాసాలను లెక్క బెట్టారంటూ మండిపడ్డారు. ఆరోగ్య మంత్రిగా.. ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. కమ్యూనిస్టు కమ్యునలిస్టుగా మారాడని విమర్శించారు. హుజూరా బాద్ లో ఈటెల ఓటమి ఖాయమని స్పష్టం చేసారు. అందుకే గజ్వెల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. బీసీ, ఎస్సిల భూములు కబ్జా చేసిన నీఛ చరిత్ర ఈటెల ది అంటూ ఎద్దేవ చేసారు. ఈటెల చిట్టాను బయటకు తెస్తాం అంటూ సపథం చేసారు. కబ్జా చేసిన భూములను పేదలకు పంచుతామని వ్యాఖ్యానించారు. ఈటెల ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. నోరు జాగ్రత్త అని హెచ్చరించారు.
MG Hector Facelift: సరికొత్త ఫీచర్లతో వస్తున్న ఎంజీ హెక్టర్