ఈటలపై మరోసారి మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో 15 రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఈటెల రాజేందర్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు ఫిర్యాదులు చేశారని..వెంటనే ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడం ఈటెలను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. హుజురాబాద్ నాయకులను ప్రజా ప్రతినిధులను డబ్బులిచ్చి కొంటున్నారు అంటూ ఈటల అనడం బాధాకరమని..టిఆర్ ఎస్ పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అమ్ముడుపోయారు అనడం బాధ కలిగిందన్నారు. టిఆర్ఎస్…
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని..క్యాడర్ అంతా టీఆర్ఎస్ తోనే ఉన్నారని హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధుల స్పష్టం చేశారు. ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లతో కమలాపూర్ మండల నాయకుల భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోనే పనిచేస్తామని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం…
ఈటలకు మరో షాక్ తగిలింది. జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు, ఎంపీపీ దొడ్డే మమతతో పాటు 12 మంది కౌన్సిలర్లు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సింగిల్విండో చైర్మన్ లు నాయకులు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కెసిఆర్, కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తామని ప్రకటించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించడంతో తెలంగాణను సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో తెరాస పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శీను కన్సిలర్ లతో ఈటల పై ప్రెస్ మీట్ పెట్టారు. గత రెండేళ్ల నుండి పార్టీకి అతీతంగా మాట్లాడుతున్న ఈటల మాటలతో పార్టీకి దూరమైనవు అని అన్నారు. ప్రగతి భవనంలో కేసీఆర్ సమయం ఇవ్వకపోతే ఆత్మగౌరవం అడ్డొచ్చిందా అని అడిగిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో పనులమీద ఉంటాడు. మిమ్ములను స్వంత కుటుంబ సభ్యునిగా,తమ్మునిగా చూసుకున్న కెసిఆర్ మీకు ఏమి తక్కువ చేశారని…
మా ప్రాంతానికి ఇంఛార్జ్ గా వస్తున్న వాళ్ళు ఇక్కడి ప్రజాప్రతినిధులు గెలుపులో ఏమన్నా సాయం చేశారా అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మాకు సహకరించకపోతే ఊరుకునేది లేదు అంటారా..సర్పంచ్ లకు ఎంపిటిసి లకు నిధులు రావు మీ గ్రామాలు అభివృద్ధి కావు అంటూ బెదిరిస్తున్నారు. మంత్రి కాక ముందు సంస్కారం లేకపోతే మంత్రి అయ్యాక అయినా సంస్కారం నేర్చుకోవాలి. కరీంనగర్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు వాళ్ళని చూసుకోవాలి తప్ప హుజురాబాద్ పై కక్ష…
వరంగల్ జిల్లా కమలాపూర్ చేరుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్… స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం హుజూరాబాద్ బయలు దేరిన ఈటల… అక్కడ జరిగే ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. హుజూరాబాద్ లో నియోజక వర్గంలోని ప్రజాప్రతనిధులు అభిమానులను కలువనున్న ఈటల… అక్కడ ఏం మాట్లాడుతారు అనేది ఆసక్తికంగా మారింది. అయితే ఈటలను మంత్రి వర్గం నుండి తొలగించినప్పటి నుండి ఆయన ఏం చేస్తారు.. ఏ రకమైన నిర్ణయం…
సిఎం కెసిఆర్ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చురకలు అంటించారు. తన ఉనికిని దెబ్బ తీసేందుకు కెసిఆర్ సర్కార్ చాలా దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆయన ఫైర్ అయ్యారు. గొర్రెల మంద మీద తోడేళ్ళు దాడి చేసినట్లు దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణకు చైతన్యాన్ని నింపిన గడ్డ మీద కుట్ర చేస్తున్నారని…తెలంగాణ ఉద్యమంకు సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు మంత్రిగా బెదిరింపులకు దిగుతున్నారని గంగుల కమలాకర్ రావును టార్గెట్ చేశారు ఈటల. ఎన్ని కుట్రలు చేసినా..…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కసారిగా మారుతున్నాయి హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయాలు. హుజూరాబాద్ లో ఈటెలను వ్యతిరేకిస్తున్నారు పలువురు ప్రజా ప్రతినిధులు. హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రమ పలువురు కార్పొరేటర్లు ఈటెల కు వ్యతిరేకంగా తీర్మానం చేసారు. తామంతా టీఆర్ఎస్ బీ ఫార్మ్ తోనే గెలిచామని…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మరింత బలోపేతమవుతుంది. తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకుంటుంది. అధికారం చేపట్టి ఏడేళ్లు పూర్తయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదని, ప్రజల్లో కేసీఆర్ గారి అచంచల విశ్వాసం వ్యక్తమవుతుందని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. తనని కలిసిన హుజురాబాద్ పార్టీ ప్రజా ప్రతినిదులతో కరీంనగర్ క్యాంప్ ఆఫీస్ లో మంత్రి మాట్లాడారు, వరుస ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాలే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ గారి పనితీరుకు, ప్రభుత్వ పనితీరుకు రెపరెండంగా వరుస ఎన్నికల…