జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో ముదిరాజుల సమావేశానికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ కామెంట్స్.. బీఆర్ఎస్ హుజూరాబాద్ లో ఒక సైకోను ఎమ్మెల్సీ గా చేసిందని విమర్శించాడు. కులంమతం చూడకుండా అన్ని వర్గాలపై బెదిరింపులకు, కిడ్నాప్ లకు పాల్పడుతుంటే సీపీకి ఫిర్యాదు చేశాము అని ఆయన తెలిపారు.
Read Also: Jawan : షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా టీజర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?
ఇప్పుడు నాలాంటి వ్యక్తుల పైనా కూడా సుపారీ ఇచ్చేంత వరకు వచ్చింది.. మా సహనం ఓపిక నశిస్తే హుజూరాబాద్ నడి చౌరస్తాలో చెప్పుల దండ వేసి తిప్పుతామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నాపై సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే ఈ సైకో చేసే హారస్మెంట్ కు దిగుతున్నాడు అని ఈటల చెప్పాడు. ఈ సైకోల వల్ల మీ పార్టీ కార్యకర్తలపై కూడా దాడులు, దౌర్జన్యాలు జరిగుతాయని ఆయన పేర్కొన్నాడు. అధికారం శాశ్వతం కాదు.. అన్ని ప్రజలు గమనిస్తున్నారు.. త్వరలో కర్రు కాల్చి వాత పెడతారు అని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపాడు.
Read Also: CBI: సీబీఐలో స్పెషల్ డైరెక్టర్‌గా ఐపీఎస్ అధికారి అజయ్ భట్నాగర్ నియామకం
సాంబశివున్ని చంపినప్పుడే స్టేట్ మెంట్ ఇచ్చిన.. అప్పటి నుంచే నాకు బెదిరింపులు మొదలయ్యాయి.. నా డ్రైవర్ ను కూడా కిడ్నాప్ చేశారు.. అప్పుడే భయపడలేదు, ఇప్పుడు భయపడతానా అని ఈటల రాజేందర్ ఆరోపించారు. అందరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది, ప్రభుత్వానిది.. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల ప్రతిపక్ష నాయకులపై జరిగుతున్న దాడులను అరికట్టాలి అని ఈటల రాజేందర్ వెల్లడించారు.