తేల్చుకుందాం.. రా! ఆ నియోజకవర్గంలో నాయకుల మాటల తూటాలు ఈ రేంజ్‌లోనే పేలుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీలోకి దిగాలని ఒకరు.. ఎలా వస్తారో చూస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే పొలిటికల్ టెంపరేచర్‌ను పెంచేస్తున్నారు. ఆ రాజకీయ వేడి సెగలను ఈ స్టోరీలో చూద్దాం. హుజూర్‌నగర్‌పై మళ్లీ కన్నేసిన ఉత్తమ్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. మరో ఏడాదిలోనే ఎన్నికలు రానున్నాయని జోస్యం…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ ప్రజలు మొత్తం ఉత్కంఠగా ఎదురుచూశారు.. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరా జరిగినా.. ఈటలకు భారీ మెజార్టీయే దక్కింది.. అయితే, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బై పోల్‌లో చతికిలపడిపోయింది.. అయితే, గత ఎన్నికల్లో 60…
హుజురాబాద్‌లో టీఆర్ఎస్ శ్రేణులు ఆశ.. నిరాశల మధ్య ఊగిసలాడారా? పార్టీ చీఫ్ కేసీఆర్ ఎన్నికల సభ ఉంటుందని.. ఆ తర్వాత ఉండదని తేలడంతో ఆలోచనలో పడ్డారా? ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడిన మాటలు.. కేడర్‌లో ఉత్సాహం నింపాయా? కేసీఆర్ సభతో గెలుపు ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలని చూశారు..! హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచార గడువు ముగిసే టైమ్ దగ్గర పడింది. ప్రధానపార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అధికారపార్టీ టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేలా పావులు కదుపుతోంది. కీలక ఎన్నికల బాధ్యతల్లో…
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరగనున్న ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… 72 గంటల ముందే సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. స్థానికేతరులు ఉండకూడదు. ఏ రకమైన ప్రచారం ఉండదు. ఎన్నికల అధికార బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి అన్నారు. ఇక 29న హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకూ పోలింగ్…
టీఆర్ఎస్ అంతర్గత ఆధిపత్య పోరుతోనే హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు వచ్చాయని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూర్ వెంకట్ తరపున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరలుఉ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ. టీఆర్ఎస్ అంతర్గత ఆధిపత్య పోరుతో ఉప ఎన్నికలు వచ్చాయని ఆరోపించారు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పనిచేసిన…
హుజురాబాద్‌లో ఉప ఎన్నికల వాతావరణం హీటెక్కిస్తోంది… ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా… మరో రెండు ప్రధాన పార్టీలు కూడా రంగంలోకి దిగాయి… బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరి వెంకట్ రేపే నామినేషన్ దాఖలు చేయనున్నారు.. రేపు ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు,…
సీఎం కేసీఆర్ ధర్మంతో గోక్కున్నారు.. మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. జమ్మికుంట మండలం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయానట.. ఎలానో చెప్పు మిత్రమా హరీష్ రావు అంటూ ప్రశ్నించారు.. పచ్చ కామెర్లవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు నేనే నామీద దాడి చేయించుకుని కట్టుకట్టుకొని వస్తా అని చెప్తున్నారు.. అలా చేసేది మీరే అని…