టీఆర్ఎస్ అంతర్గత ఆధిపత్య పోరుతోనే ఉప ఎన్నికలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ అంతర్గత ఆధిపత్య పోరుతోనే హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు వచ్చాయని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూర్ వెంకట్ తరపున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరలుఉ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ. టీఆర్ఎస్ అంతర్గత ఆధిపత్య పోరుతో ఉప ఎన్నికలు వచ్చాయని ఆరోపించారు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఈటల ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని టీఆర్ఎస్ పార్టీ అంటుంది అని ఎద్దేవా చేశారు.
ఇక, అసమర్థ రాజకీయ పార్టీ ఒకవైపు, అసమర్థ అభ్యర్థి మరోవైపు ఉప ఎన్నికల్లో ఉన్నారని.. వారిద్దరికీ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కులేదని మండిపడ్డారు ఎమ్మెల్సీజీవన్‌రెడ్డి.. 2004లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత కరెంట్‌ను అందించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.. రైతు బాగుంటేనే కూలి బాగుంటాడు.. రైతుల పక్షపాత పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేసిన ఆయన.. కాంగ్రెస్ హయాంలో పేద ప్రజలకు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందించాం అని గుర్తు చేశారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచిన పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలని అని ప్రశ్నించిన జీవన్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?