కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరగనున్న ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… 72 గంటల ముందే సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. స్థానికేతరులు ఉండకూడదు. ఏ రకమైన ప్రచారం ఉండదు. ఎన్నికల అధికార బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి అన్నారు. ఇక 29న హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకూ పోలింగ్ జరుగుతుంది. అయితే కరీంనగర్ SRR కాలేజీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసారు. అయితే ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక వైపే చూస్తున్న విషయం తెలిసిందే.