కేసీఆర్ ధర్మంతో గోక్కున్నారు.. మూల్యం చెల్లించుకోక తప్పదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ ధర్మంతో గోక్కున్నారు.. మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. జమ్మికుంట మండలం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయానట.. ఎలానో చెప్పు మిత్రమా హరీష్ రావు అంటూ ప్రశ్నించారు.. పచ్చ కామెర్లవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు నేనే నామీద దాడి చేయించుకుని కట్టుకట్టుకొని వస్తా అని చెప్తున్నారు.. అలా చేసేది మీరే అని మండిపడ్డారు. నాది రోశంగల్ల పుట్టుక.. నేను కాళ్లు మొక్కుతా బాంచన్ అని లేఖ రాస్తానా ? అంటూ ప్రశ్నించిన ఆయన.. దళితబంధు వద్దు అని నేను లేఖరాసినట్టు.. తప్పుడు ప్రచారం చేస్తే ఎన్నికల కమిషన్ మాకు ఎలాంటి లేఖ రాలేదు అని స్పష్టం చేసింది.. అయినా, మళ్లీ ఇంకో ఫేక్ పోస్ట్ సృష్టించారని.. మీరంతా ఫేక్‌గాళ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ పథకం కావాలన్నా ఇంటిమీద టీఆర్ఎస్ జెండా ఉండాలట… ఇది నీ జాగీరా కేసీఆర్ అంటూ నిలదీసిన ఈటల రాజేందర్.. ఇవన్నీ మా డబ్బులు.. తాగే సీసాలు మీద సంవత్సరానికి 30 వేల కోట్ల డబ్బులు వస్తున్నారు.. పెన్షన్ల మీద పెట్టే ఖర్చు రూ. 9 వేల కోట్లే అన్నారు. ఇక్కడికి వస్తున్న ఆరూరి రమేష్ ని అడగండి.. ఆయన నియోజకవర్గంలో దళితబంధు ఇస్తున్నాడా..? రాత్రికి రాత్రి రోడ్లు పోస్తున్నారా? అని ప్రజలకు సూచించారు. ఇక, నీ బొమ్మ పెట్టుకుంది నిజమే అయితే.. నీ కూతురు కవిత ఎందుకు ఓడి పోయింది? అని ప్రశ్నించారు. నా రాజీనామాతో ఇన్ని వచ్చాయి.. ఇంకా చాలా వస్తాయని కామెంట్ చేసిన ఈటల.. నేను గెలిస్తే తెలంగాణ రాజకీయ చరిత్ర మారుతుందన్నారు.. ఇందిరా, ఎన్టీఆర్ లాంటివారే ఓడిపోయారు.. ఎవరు శాశ్వతం కాదు.. అంటూ కేసీఆర్‌ను మెచ్చరించిన ఆయన.. మీకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకోండి.. కానీ, ప్రమాణాలు చేయకండి అని సూచించిన ఈటల.. మోకాళ్ల మీద, మోచేతుల మీద నడిచినా మీకు ఓట్లు వెయ్యరు అంటూ ఎద్దేవా చేశారు.
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!