75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మన ఇండియన్ స్టార్ హీరోయిన్ జ్యూరీ మెంబర్ గా ఎంపిక కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక జ్యూరీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మెంబర్ ఎంపికైంది. “కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022″కు జ్యూరీ సభ్యుల్లో ఆస్కార్ విజేత, చిత్రనిర్మాత అస్గర్ ఫర్హాదీ, బ్రిటిష్ నటి రెబెక్కా హాల్, స్వీడిష్ నటి నూమీ రాపేస్, ఇటాలియన్ నటి జాస్మిన్ ట్రింకా, ఫ్రెంచ్ చిత్ర దర్శకుడు లాడ్జ్ లై, నార్వేజియన్ చిత్ర దర్శకుడు…
“ఆర్ఆర్ఆర్”తో జక్కన్న క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. పైగా బాలీవుడ్ ప్రేక్షకులంతా సౌత్ మాయలో పడిపోయారు. “పుష్ప” నుంచి మొదలైన సౌత్ మేనియా బాలీవుడ్ లో ఇంకా ఏమాత్రం తగ్గనేలేదు. “పుష్ప” తరువాత ఒకటో రెండో సినిమాలు విడుదలైనా… ఒక్క “గంగూబాయి కతియవాడి” తప్ప మిగతావి పెద్దగా సందడి చేయలేకపోయాయి. ఆ తరువాతే మొదలైంది అసలు కథ… “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్లు, మూవీ రిలీజ్ కావడం, బ్లాక్ బస్టర్ హిట్ కావడం, భారీ కలెక్షన్లు…
పాపులర్ హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ కు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. ఆస్కార్ 2022 సంఘటన తర్వాత ఆయనకు అన్నీ చేదు ఘటనలే ఎదురవుతున్నాయి. క్రిస్ రాక్‌ను ఆస్కార్ 2022 అవార్డుల వేదికపై కొట్టి సంచలనం సృష్టించిన విల్ స్మిత్ ఆ తరువాత ఆయనకు, ఆయన కుటుంబానికి బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. అకాడమీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ వివాదాల మధ్య విల్ స్మిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. Read Also…
బ్రూస్ విల్లీస్ – ఈ పేరు వింటే డై హార్డ్ సిరీస్ మన మదిలో మెదలుతాయి. 1980ల చివరలో రూపొందిన డై హార్డ్ ఫ్రాంచైజ్ లో హీరోగా నటించిన బ్రూస్ విల్లీస్ నిజజీవితంలోనూ అదే రీతిన ప్రవర్తించారు. తన కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచడానికి డై హార్డ్గానే వ్యవహరించారు. అలాంటి విల్లీస్ 67 ఏళ్ళ వయసులో అఫేసియా వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాది ప్రభావం వల్ల మెదడులోని కణాలు నెమ్మదిగా దెబ్బతింటాయి. తత్ఫలితంగా వినికిడి శక్తి లోపిస్తుంది. ఉచ్చరణ…
ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో అందరి కళ్ళు బ్లాక్ సూపర్ స్టార్ విల్ స్మిత్ మీదే ఉన్నాయి. ఎందుకంటే గతంలోనూ ఆయన రెండు సార్లు ఆస్కార్ నామినేషన్స్ సంపాదించినా, విన్నర్ గా నిలువలేక పోయారు. ముచ్చటగా మూడోసారి బెస్ట్ యాక్టర్ నామినేషన్ సంపాదించిన విల్ స్మిత్ తన ‘కింగ్ రిచర్డ్’ ద్వారా అనుకున్నది సాధించారు. అవార్డు అందుకోగానే విల్ స్మిత్ మోములో ఆనందం చిందులు వేసింది. దేవుడు తనను ఈ లోకంలో ఉంచినందుకు ఈ రోజున కారణం…
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం అందరికి తెరిచిన పుస్తకమే.. ఆమె పాటలు, ఆమె జీవితం, తండ్రితో గొడవలు, కోర్టు కేసులు ఇలా ఆమె జీవితమే ఒక నరకప్రాయమని చెప్పాలి. అయితే అందరికి తెలిసినవి కొన్నే ఉన్నా.. ఎవ్వరికీ తెలియనివి.. ఆమె మనసులో గూడు కట్టుకున్న రహస్యాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటిని బయటపెట్టాలని, బ్రిట్నీ జీవితం అందరికి తెలియాలని అమెరికాలోని ఓ టాప్ పబ్లిషింగ్ హౌజ్ భీష్మించుకు కూర్చొంది. ఇందుకోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్దమంటుంది. పాప్…
సమాజం మారుతున్న కొద్దీ చిత్ర పరిశ్రమ కూడా మారుతోంది. ప్రేక్షకుల అభిరుచిని బట్టి సినిమాలు తెరకెక్కిస్తున్న డైరెక్టర్లు.. ఇక కథను బట్టి పెదవి ముద్దులు, నగ్న సన్నివేశాలు సర్వసాధారణమైపోయాయి. హాలీవుడ్ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవల ‘యుఫోరియా’ వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన నటి మింకా కెల్లీ డైరెక్టర్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. “ఈ సిరీస్ కోసం డైరెక్టర్ తనను నగ్నంగా నటించమని అడిగారు.. ఆ సీన్…
హాలీవుడ్ సినిమాలలో “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉంది. విన్ డీజిల్ తన టీంతో కలిసి చేసే అద్భుతమైన విన్యాసాలు యాక్షన్ ప్రియులకు బాగా థ్రిల్ చేస్తాయి. ఇప్పుడు రాబోతున్న “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10” గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10” నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ కొత్త మూవీలో ‘ఆక్వామ్యాన్’గా పాపులర్ అయిన జాసన్ మోమోవా కూడా చేరిపోయారు.…
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అద్భుతమైన ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లిన చిత్రం ‘అవతార్’. వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ చేసిన మాయ ఆయన పేరును తలచుకున్నా చాలు కళ్లముందు కదలాడుతుంది. అయితే మొదటి పార్ట్ కు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నాయి. ‘అవతార్’ సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు సైతం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను 2022…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావటం విశేషం. ప్రభాస్ తరహాలో ఏ భారతీయ హీరో ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలకు రెడీగా ఉంది. ఇక ‘సలార్’, ‘ఆదిపురుష్’ సెట్స్ మీద ఉన్నాయి. ఇవి కాక అశ్వనీదత్ బ్యానరులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి కాకుండా ‘స్పిరిట్’ సినిమా కమిట్…