హాలీవుడ్ సినిమాలలో “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉంది. విన్ డీజిల్ తన టీంతో కలిసి చేసే అద్భుతమైన విన్యాసాలు యాక్షన్ ప్రియులకు బాగా థ్రిల్ చేస్తాయి. ఇప్పుడు రాబోతున్న “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10” గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10” నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ కొత్త మూవీలో ‘ఆక్వామ్యాన్’గా పాపులర్ అయిన జాసన్ మోమోవా కూడా చేరిపోయారు. ఆయన ఇందులో ఆక్వామ్యాన్ స్టార్ విలన్ గా నటించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
Read Also : తగ్గేదే లే బన్నీ… 10 రోజుల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ !
2021లో ‘ఎఫ్9 : ది ఫాస్ట్ సాగా’కు చివరిగా దర్శకత్వం వహించిన జస్టిన్ లిన్ ‘ఎఫ్10’కు కూడా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మిచెల్ రోడ్రిగ్జ్, టైరీస్ గిబ్సన్, క్రిస్, సంగ్ కాంగ్, చార్లీజ్ థెరాన్ ‘ఎఫ్10’లో తిరిగి కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2023 మే 19న యూనివర్సల్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు మోమోవా గత సంవత్సరం ‘ఆక్వామ్యాన్’ సీక్వెల్ ‘ఆక్వామ్యాన్ అండ్ లాస్ట్ కింగ్‌డమ్’ చిత్రీకరణను పూర్తి చేశాడు.