అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన భారతీయ సినిమాలలో RRR అత్యుత్తమమైనది. విజయేంద్ర ప్రసాద్ రచించిన మరియు SS రాజమౌళి దర్శకత్వం వహించిన ఎపిక్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర అగ్ర చిత్ర పరిశ్రమలలో చర్చనీయాంశంగా ఉంది.
ప్రపంచంలో ఎంతోమంది నటీనటులకు స్వర్గధామం హాలీవుడ్! అక్కడ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించిన తారలు ఎందరో హాలీవుడ్‌ను వదిలేస్తూ ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
హాలీవుడ్ డైరెక్టర్ పాల్ హగ్గిస్ పేరు ఫిలిమ్ బఫ్స్ కు సుపరిచితమే! ఆయన రచనతో తెరకెక్కిన ‘మిలియన్ డాలర్ బేబీ’, ‘క్రాష్’ చిత్రాలు ఆస్కార్ ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. ‘క్రాష్’ ద్వారా ఆయనకు నిర్మాతగా, రచయితగా కూడా ఆస్కార్ అవార్డులు లభించాయి. 69 ఏళ్ళ హగ్గిస్ ను ఇప్పటికీ కొందరు రొమాంటిక్ అంటూ కీర్తిస్తుంటారు. అందులో నిజానిజాలు ఏమో కానీ, ఓ రేప్ కేసులో హగ్గిస్ ను ఇటలీ పోలీసులు ఆదివారం (జూన్ 19న) అదుపులోకి తీసుకున్నారు.…
మార్వెల్ కామిక్స్ తో పరిచయం ఉన్న వారందరికీ సూపర్ హీరో సిరీస్ లో భలేగా హల్ చల్ చేసే కమలా ఖాన్ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రకు ప్రాణం పోసి తెరపై ఆవిష్కరిస్తోంది మార్వెల్ సంస్థ. ‘మార్వెల్స్’ సిరీస్ లో భాగంగా ‘ద మార్వెల్స్’లో కమలా ఖాన్ పాత్రలో పాకిస్థాన్ నటి ఇమాన్ వెల్లనీ నటించింది. ఈ నెలతో షూటింగ్ పూర్తి చేసుకొనే ‘ద మార్వెల్స్’ వచ్చే యేడాది జూలై 28న జనం ముందు నిలవనుంది. తొలిసారి…
ప్రియాంక చోప్రా.. పరిచయం అక్కర్లేని పేరు. ఈమధ్య కాలంలో ఈ అమ్మడు ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లోకెక్కుతోంది. ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఫోటోతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఆ ఫోటోలో ప్రియాంక ముఖంపై మనం రక్తపు మరకల్ని గమనించవచ్చు. పెదాలు చిట్లిపోయి, ముక్కలో నుంచి రక్తం రావడాన్ని కూడా చూడొచ్చు. ఫేస్పై అక్కడక్కడ దద్దర్లు సైతం ఉన్నాయి. ఎవరైనా ఈ ఫోటోని చూసిన వెంటనే.. ప్రియాంకను ఎవరో కొట్టారనో లేదా ఆమెకి ఏదో ప్రమాదం జరిగిందనో…
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు కొన్నేళ్లుగా ‘అవతార్-2’ చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2009లో హాలీవుడ్లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్సృష్టించిన గొప్ప విజువల్ వండర్ ‘అవతార్’. ఈ మూవీకి పలు ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. దీనికి సీక్వెల్గా వస్తున్న మూవీ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. ఏకంగా 160 భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ట్రైలర్ను దర్శకుడు జేమ్స్ కామెరాన్ విడుదల…