Britney Spears: ఆ రహస్యాల విలువ అక్షరాలా రూ. 112 కోట్లు అంట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం అందరికి తెరిచిన పుస్తకమే.. ఆమె పాటలు, ఆమె జీవితం, తండ్రితో గొడవలు, కోర్టు కేసులు ఇలా ఆమె జీవితమే ఒక నరకప్రాయమని చెప్పాలి. అయితే అందరికి తెలిసినవి కొన్నే ఉన్నా.. ఎవ్వరికీ తెలియనివి.. ఆమె మనసులో గూడు కట్టుకున్న రహస్యాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటిని బయటపెట్టాలని, బ్రిట్నీ జీవితం అందరికి తెలియాలని అమెరికాలోని ఓ టాప్ పబ్లిషింగ్ హౌజ్ భీష్మించుకు కూర్చొంది. ఇందుకోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్దమంటుంది.
పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ జీవితాన్ని ఒక పుస్తక రూపంలో పబ్లిష్ చేయడానికి ఆ సంస్థ బ్రిట్నీ కి 15 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 112 కోట్ల రూపాయలు అప్పజెప్పేందుకు సిద్దమయ్యింది. ఆమె జీవితంలో ఉన్న రహస్యాలన్నీ చెప్పడానికి బ్రిట్నీ కూడా అంగీకరించింది. చిన్నతనంలో ఈ సింగర్ పడిన నరకం, బ్రిట్నీ తండ్రి జేమీ స్పియర్స్ సంరక్షణలో తాను అనుభవించిన 13 ఏళ్ల నరకప్రాయమైన జీవితం గురించి అనేక రహస్యాలను ఆమె ఈ బుక్ లో వెల్లడించనున్నదట. అందుకోసమే అన్ని కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక తండ్రి చెర నుంచి బయటపడడానికి బ్రిట్నీ చేసిన పోరాటం తెలియంది కాదు. కోర్టుల చుట్టూ ఎన్నో ఏళ్లు తిరిగి ఎట్టకేలకు ఇటీవలే కోర్టు ద్వారా తండ్రి చెరనుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె స్వతంత్రంగా జీవిస్తుంది.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!