Cannes Film Festival 2022 : జ్యూరీ మెంబర్ గా మన హీరోయిన్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మన ఇండియన్ స్టార్ హీరోయిన్ జ్యూరీ మెంబర్ గా ఎంపిక కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక జ్యూరీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మెంబర్ ఎంపికైంది. “కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022″కు జ్యూరీ సభ్యుల్లో ఆస్కార్ విజేత, చిత్రనిర్మాత అస్గర్ ఫర్హాదీ, బ్రిటిష్ నటి రెబెక్కా హాల్, స్వీడిష్ నటి నూమీ రాపేస్, ఇటాలియన్ నటి జాస్మిన్ ట్రింకా, ఫ్రెంచ్ చిత్ర దర్శకుడు లాడ్జ్ లై, నార్వేజియన్ చిత్ర దర్శకుడు జోచిమ్ ట్రైయర్ ఉండగా, ఈ జాబితాలో దీపికా కూడా స్థానం దక్కించుకుంది. ఈ మేరకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు సంబంధించి, ఎనిమిది మంది జ్యూరీ సభ్యుల లిస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ జాబితాలో ఉన్న ఇండియా నుంచి దీపికా మాత్రమే ఉండడం విశేషం.
Read Also : Kiara Advani : హీరోతో బ్రేకప్ పై ఇన్ డైరెక్ట్ క్వశ్చన్… హీరోయిన్ ఎపిక్ రిప్లై
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మే 28న కేన్స్‌లో జరిగే గాలా వేడుకలో ప్రత్యేక జ్యూరీ ఈ సంవత్సరం విజేతలను ప్రకటిస్తుంది. ఫ్రెంచ్ నటుడు, చిత్రనిర్మాత విన్సెంట్ లిండన్ ఈ ప్రత్యేక జ్యూరీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 17న ప్రారంభమై మే 28న ముగుస్తుంది. సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘క్రైమ్స్ ఆఫ్ ది ఫ్యూచర్’, ‘క్లైర్ డెనిస్ స్టార్స్ ఎట్ నూన్’తో సహా దాదాపు 21 సినిమాలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో పోటీ పడుతున్నాయి. దీపికా పదుకొణె లోరియల్ అంబాసిడర్‌గా కాకుండా జ్యూరీ మెంబర్‌గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరుకావడం ఇదే తొలిసారి. 2017లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్ పై అడుగు పెట్టింది దీపికా. మరోవైపు హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీజిల్‌తో కలిసి నటించిన “XXX : The Return of Xander Cage” చిత్రంతో దీపికా హాలీవుడ్ అరంగేట్రం చేసింది. కాగా ఇంతకుముందు కేన్స్ కు జ్యూరీ సభ్యులుగా ఎంపికైన ఇండియన్ స్టార్స్ లో చేతన్ ఆనంద్, మృణాల్ సేన్, మీరా నాయర్, అరుంధతీ రాయ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, నందితా దాస్, షర్మిలా ఠాగూర్, శేఖర్ కపూర్, విద్యాబాలన్ వంటి ప్రముఖులు ఉన్నారు.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!