“ఆర్ఆర్ఆర్”తో జక్కన్న క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. పైగా బాలీవుడ్ ప్రేక్షకులంతా సౌత్ మాయలో పడిపోయారు. “పుష్ప” నుంచి మొదలైన సౌత్ మేనియా బాలీవుడ్ లో ఇంకా ఏమాత్రం తగ్గనేలేదు. “పుష్ప” తరువాత ఒకటో రెండో సినిమాలు విడుదలైనా… ఒక్క “గంగూబాయి కతియవాడి” తప్ప మిగతావి పెద్దగా సందడి చేయలేకపోయాయి. ఆ తరువాతే మొదలైంది అసలు కథ… “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్లు, మూవీ రిలీజ్ కావడం, బ్లాక్ బస్టర్ హిట్ కావడం, భారీ కలెక్షన్లు కొల్లగొట్టడం జరిగిపోయింది. “ఆర్ఆర్ఆర్” విడుదలై మూడు వారాలు గడిచినా, ఆ సినిమా క్రేజ్ కారణంగా ఒక్కటంటే ఒక్క హిందీ సినిమా కూడా రిలీజ్ కు ముందడుగు వేయలేదు. నార్త్ ఇండియాలో హిట్ అయిన ఈ సినిమా మూడో వారంలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక ఇప్పుడు “కేజీఎఫ్-2″తో రాఖీభాయ్ బాలీవుడ్ ను ఆక్రమించేసుకున్నాడు.
Read Also : KGF Chapter 2 Twitter Review : టాక్ ఏంటంటే ?
“కేజీఎఫ్-2″కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రం ఖచ్చితంగా రెండు వారాల పాటు అక్కడి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తుందనడంలో సందేహం లేదు. మొత్తానికి మన సౌత్ సినిమాలు బాలీవుడ్ ను ఆక్రమించేసుకున్నాయనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు నెల రోజుల నుంచి అక్కడ సౌత్ దే హవా నడుస్తోంది. పైగా “కేజీఎఫ్-2″తో పోటీకి వెనకడుగు వేశాడు షాహిద్ కపూర్. ఆయన హీరోగా నటించిన హిందీ “జెర్సీ” చిత్రం ఈ విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక అజయ్ దేవగన్ “రన్‌వే 34”, టైగర్ ష్రాఫ్ “హీరోపంతి 2” ఏప్రిల్ 29న విడుదలవుతున్నాయి. మే, జూన్‌లలో వరుస హిందీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. RRR, KGF: 2 వంటి రెండు సౌత్ మూవీస్ పలు హిందీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటన్నింటిని పక్కకు నెట్టేసి… నెల రోజుల పాటు బీటౌన్ ను ఏలేయడం అంటే విశేషమే మరి !