Himachal Pradesh: ఆగకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తర భారతదేశం వణికిపోతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నీటితో నిండిపోయాయి. వరదలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయింది.
Train Cancellations: భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. జూలై 7 - జూలై 15 మధ్య దేశవ్యాప్తంగా 300 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 406 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి.
వానలు వచ్చాయ్.. వరదలు వచ్చాయ్.. ఊరువాడా నీటిలో మునిగే.. ఇది ఇప్పుడు దేశ పరిస్థితి.. ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో దేశం మొత్తం నిండు కుండలా ఉంది..ఇక గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని రాష్ట్రాల్లో వరదలు ముంచేత్తుతున్నాయి.. ఎప్పుడు ప్రాణాలు హరి అంటాయా అని జనం భయంతో కంటి మీద కునుకు లేకుండా ఉండారు..కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి.. వరదల్లో రాలేక బంధువులు వీడియో కాల్ లో…
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు ఉత్తరాది విలవిల్లాడుతోంది. కొండలు, కోనలు దొర్లిపడుతున్నాయి. వరద నీటి ప్రవాహానికి ఇళ్లు, మార్కెట్లు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి..లోతట్టు ప్రాంతాలు జలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వరద ముప్పు ఏర్పడింది. ఇప్పటికే వాగులు, వంకలు, నదులు వరద ఉధృతితో అడ్డొచ్చినవాటిని కొట్టుకుంటూ పోతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో ఎక్కడికక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి.…
కులు ప్రాంతంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో వధూవరులు కులులో పెళ్లి మండపానికి వెళ్లలేకపోయారు. దీంతో ఆన్‌లైన్‌లో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆశిష్, శివానీల మ్యారేజ్ జరిపించారు. ఈ ఆన్లైన్ పెళ్లికి వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ కూడా హాజరయ్యారు.
ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాలు కొనసాగుతుండటంతో భారీ వర్షాలు, వరద సంబంధిత సంఘటనలలో 100 మందికి పైగా మరణించారు. గత వారం వర్షం ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోనే దాదాపు 80 మంది మరణించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులకు ఇవాళ( సోమవారం) ఫోన్ లో మాట్లాడారు. ఉత్తర భారత దేశంలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరదల దెబ్బకు రహదారులు తెగిపోయాయి. ఆయా ప్రాంతాలు, గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు పెద్ద పెద్ద భవనాలు కూడ పేకమేడలా కూలిపోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో…
ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో దాదాపు 12 మంది మరణించారు. రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ వారం ప్రారంభంలో రుతుపవనాలు వచ్చినందున ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గురువారం వర్షం, మేఘావృతమైన ఆకాశం కనిపించింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 23.5 డిగ్రీల సెల్సియస్ కాగా.. గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది..అతి వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం లో నలుగురు మరణించగా పలువురికి తీవ్రగాయాలతో బయట పడ్డారు.. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం.. వివరాల్లోకి వెళితే..హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలోని రాంపూర్ లో బుధవారం ఉదయం ఓ కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఓ బాలిక కూడా ఉంది. అయితే ఆ కారు భద్రాష్-రోహ్రు…