దేశంలో సుందరమైన రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో వచ్చిన భారీ వర్షాలతో రాష్ట్రం అతలా కుతలంగా మారింది. రాష్ట్రం సర్వనాశనవం అయింది.
సుందరమైన హిమాచల్‌ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో బీతావహంగా మారిపోతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం వేల కోట్ల నష్టపోయింది.
కులులో కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు కూలిపోయాయి. దీంతో కూలిపోయిన భవనాలు, ఇళ్ల శిథిలాల మధ్య పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కొండచరియల ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
నైరుతు రుతుపవనాలు ప్రారంభం అయినప్పటి నుంచీ హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు వరదల నుంచి కోలుకోలేదు.
వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్రం రూ.200 కోట్లు మంజూరు చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌కు ముందస్తు సహాయంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.200 కోట్లను విడుదల చేయడానికి కేంద్రం ఆదివారం ఆమోదం తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు రాష్ట్రంలో 74 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా రూ. 10వేల కోట్ల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.
Apple Price Hike: భారీ వర్షాలు, వరదలు, విరిగిపడిన కొండ చరియల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. ఆ రాష్ట్రంలో పండిన పంట సరఫరాలో జాప్యం కారణంగా టమాటాల తర్వాత ఆపిల్ ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదైంది. దీంతో టమాటాలు, ఇతర కూరగాయలతో పాటు పండ్ల సరఫరా కూడా దెబ్బతింది.
Landslide: ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు పర్వతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలు తెరపైకి వస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రెండు రాష్ట్రాల్లో 60 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు.