Emergency Landing: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుతో కూడిన హెలికాప్టర్ గురువారం రాంపూర్‌లోని బితాల్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి వెంట పబ్లిక్ వర్క్స్ మంత్రి, థియోగ్ ఎమ్మెల్యే, సీఎం ప్రెస్ సెక్రటరీ ఉన్నారు.
Also Read: Parliament Of CJI: సీజేఐ లేకుండానే ఎన్నికల సంఘం నియామకం.. బిల్లుకు రెడీ అయిన కేంద్రం
జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ప్రాజెక్ట్ ప్రాంగణంలో హెలిప్యాడ్ నిర్మించబడింది. అయితే హెలికాప్టర్ నిర్ణీత ప్రదేశంలో ల్యాండ్ కాకపోవడంతో పైలట్లు 500 మీటర్ల దూరంలోని పొలంలో ముందుజాగ్రత్తగా ల్యాండింగ్ చేశారు. పైలట్లు వెంటనే సరైన నిర్ణయం తీసుకుని పొలంలో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడం వల్ల సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు.