హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు రాష్ట్రంలో 74 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా రూ. 10వేల కోట్ల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.
Apple Price Hike: భారీ వర్షాలు, వరదలు, విరిగిపడిన కొండ చరియల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. ఆ రాష్ట్రంలో పండిన పంట సరఫరాలో జాప్యం కారణంగా టమాటాల తర్వాత ఆపిల్ ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదైంది. దీంతో టమాటాలు, ఇతర కూరగాయలతో పాటు పండ్ల సరఫరా కూడా దెబ్బతింది.
Landslide: ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు పర్వతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలు తెరపైకి వస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రెండు రాష్ట్రాల్లో 60 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేశారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. రెండు రాష్ట్రాల్లో 65 మందికి పైగా మరణించినట్లు సమాచారం. కొండచరియలు విరిగిపడటం, వరదలు, మేఘాలు, భారీ వర్షాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తులకు కూడా…
హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలకు జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం. నిరంతర వర్షాల కారణంగా గత 24 గంటల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సోమవారం తెలిపారు.. శిథిలాల కింద 20 మందికి పైగా చిక్కుకుపోయి ఉంటారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న…
హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో అక్కడి జనాలు అతలాకుతలం అవుతున్నారు. గత 24 గంటల్లో వర్షాల కారణంగా 29 మంది మరణించారు.
హిమాచల్ ప్రదేశ్ ను వానలు వదలడం లేదు. కొన్ని రోజుల ముందు వచ్చిన జలప్రళయం నుంచి కోలుకోక ముందే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్లీ వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.కొండల్లో నుంచి కొట్టుకు వచ్చిన బురద, మట్టి, రాళ్లతో వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. Also Read: Instagram: ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్.. ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారని..! కొండ…
శుక్రవారం చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం సియుల్ నదిలో పడటంతో ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది.