రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఫలితంతో సంబంధం లేకుండా ‘పెద్ది’ సినిమాకు ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా $9.5 మిలియన్లకు (సుమారు రూ. 80 కోట్లు) అమ్ముడయ్యాయి. ఇందులో కేవలం నార్త్ అమెరికా డీల్ మాత్రమే $7 మిలియన్లు పలకడం విశేషం. రామ్ చరణ్ సోలో కెరీర్లోనే ఇది ఆల్‌టైమ్ రికార్డ్. ఒక గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే కథకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడం గ్లోబల్ స్టార్‌గా చరణ్ సంపాదించుకున్న క్రేజ్‌కు నిదర్శనం. గత సినిమా ఓవర్సీస్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’ మీద ఉన్న నమ్మకంతో బయ్యర్లు ఈ భారీ మొత్తాన్ని వెచ్చించడం విశేషం.
Also Read : AR Rahman : టాలీవుడ్లో రెహమాన్ సెకండ్ ఇన్నింగ్స్.. ‘పెద్ది’ మ్యూజిక్ తెచ్చిన క్రేజ్!
ఇక డిజిటల్ రైట్స్ విషయంలోనూ ‘పెద్ది’ సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా అన్ని భాషల హక్కులను సుమారు రూ. 110 కోట్ల నుంచి రూ. 130 కోట్ల మధ్య భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తికాకముందే ఈ స్థాయి డీల్ కుదరడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30, 2026న విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ పవర్ఫుల్ ప్యాకేజీని చూస్తుంటే, చరణ్ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.