Heavy Snow fall: ఉత్తరాదిలో భారీగా మంచుకురుస్తోంది. దీంతో ఆయా ప్రభావిత రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో.. ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది.
Water Contamination : హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని నదౌన్ సబ్ డివిజన్‌లో కలుషిత నీరు తాగి 535మంది అస్వస్థతకు గురయ్యారు. బాన్, జంద్గీ గుజ్రాన్, జందలి రాజ్‌పుతాన్, పన్యాల, పథియాలు, నియతి, రంగస్ చౌకీ హార్, థాయిన్, శంకర్‌తో సహా డజను గ్రామాల ప్రజలు నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడ్డారు.
Himachal cabinet expansion sparks dissent in Congress: చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించింది. గెలుపొందిన సంతోషంలో ఉన్న కాంగ్రెస్ లో లుకలుకలు కనిసిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని రాజేసింది. కాంగ్రా ఎమ్మెల్యే సుధీర్ శర్మ, ఘరావిన్ ఎమ్మెల్యే రాజేష్ ధర్మాని అధిష్టానంపై బహిరంగంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు…
హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు ఉదయం జరగనుంది. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఈ వేడుక జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Fund For Orphans: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అనాథ పిల్లల ఉన్నత విద్యకు నిధిని ప్రకటించారు. రాష్ట్రంలోని సుమారు 6,000 మంది అనాథ పిల్లలకు నూతన సంవత్సర కానుకగా రూ. 101 కోట్ల నిధిని సీఎం సుఖాశ్రయ సహాయత కోష్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ ప్రతిభా సింగ్ హాజరయ్యారు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు చేపట్టింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎం పదవికి నేతల మద్య పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు.