ఈ వారం ప్రారంభంలో రుతుపవనాలు వచ్చినందున ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గురువారం వర్షం, మేఘావృతమైన ఆకాశం కనిపించింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 23.5 డిగ్రీల సెల్సియస్ కాగా.. గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది..అతి వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం లో నలుగురు మరణించగా పలువురికి తీవ్రగాయాలతో బయట పడ్డారు.. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం.. వివరాల్లోకి వెళితే..హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలోని రాంపూర్ లో బుధవారం ఉదయం ఓ కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఓ బాలిక కూడా ఉంది. అయితే ఆ కారు భద్రాష్-రోహ్రు…
దేశంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లో తొలి రుతుపవన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. అన్ని చోట్లా పరిస్థితి దారుణంగా ఉంది. వర్షపు నీటి కారణంగా చాలా నదులు ఉప్పొంగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు రహదారులపై జామ్ ఏర్పడింది. మండి నుంచి కులు వెళ్లే రహదారిపై కొండచరియలు భయంకరంగా విరిగిపడ్డాయి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్‌తో సహా పలు రాష్ట్రాల్లోకి త్వరలో ప్రవేశించనున్నాయి.
వేరే మతం అమ్మాయిని ప్రేమించడమే అతడు చేసుకున్న పాపంగా మారింది. ఫలితంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మతాంతరం సంబంధం కారణంగా ఓ వ్యక్తి హత్యతో పాటు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన దారుణ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో చోటుచేసుకుంది.
టాస్ గెలిచిన సంజూ శాంసన్ సేన ఫీల్డింగ్ తీసుకోవడంతో పంజాబ్ కింగ్స్ తొలి ఇన్సింగ్స్ లో భారీ స్కోర్ సాధించారు. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ధర్మశాల వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చౌపాల్ తహసీల్ నెర్వా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది.
Earthquake: టర్కీలో భారీ భూకంపం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. టర్కీతో పాటు సిరియాతో కలిపి ఇప్పటి వరకు 47 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మనదేశంలో కూడా ఇలాంటి భూకంపం తప్పదని చాలా మంది భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా హిమాలయ రాష్ట్రాలు ఎక్కువ రిస్క్ జోన్ లో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో త్వరలోనే భారీ భూకంపం వచ్చే…