Himachal Pradesh: ఆగకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తర భారతదేశం వణికిపోతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నీటితో నిండిపోయాయి. వరదలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయింది. దీంతో కేంద్రం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్) కింద రూ. 180.40 కోట్ల అడ్వాన్స్ మొత్తాన్ని విడుదల చేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం (జూలై 14) ఆమోదం తెలిపారు. వర్షాకాలంలో బాధిత ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయడం దోహదపడుతుందని ఇక్కడ విడుదల చేసిన అధికారిక ప్రకటన పేర్కొంది. మధ్యంతర ఉపశమనంగా హిమాచల్ ప్రదేశ్‌కు 2023-24 సంవత్సరానికి SDRF రెండవ విడతలో 180.40 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి హోం మంత్రి అమిత్ షా ఆమోదించారని పేర్కొంది.
Read Also:WI vs IND: అశ్విన్ స్పిన్ మాయాజాలం.. తొలి టెస్టులో భారత్‌కు ఇన్నింగ్స్ విజయం!
హిమాచల్ ప్రదేశ్‌లో వరద బాధిత ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం SDRF నుండి రాష్ట్రానికి మొదటి విడతగా 180.40 కోట్ల రూపాయలను జూలై 10న విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవటానికి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని లాజిస్టిక్, ఆర్థిక సహాయాన్ని అందించిందని ప్రకటన పేర్కొంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్)కి చెందిన 11 బృందాలతో పాటు పడవలు, ఇతర అవసరమైన పరికరాలను సహాయక చర్యల కోసం మోహరించినట్లు తెలిపింది.
Read Also:TTD: ముగుస్తున్న టీటీడీ పాలక మండలి గడువు.. ఆ రెండు ఆప్షన్లపై ఉత్కంఠ..
హిమాచల్ ప్రదేశ్‌లో విపత్తును ఎదుర్కోవడానికి, ప్రజలకు భద్రత కల్పించడానికి ప్రభుత్వం పాంటా సాహిబ్‌లో సైనిక సిబ్బందిని మోహరించింది. ఈ ఆపరేషన్ కోసం రెండు Mi-17V5 హెలికాప్టర్‌లను కూడా మోహరించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలను అంచనా వేయడానికి, క్షేత్ర పరిస్థితిని అక్కడికక్కడే అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇంటర్-మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్‌లను (IMCT) కూడా ఏర్పాటు చేసింది. ఈ బృందాలు జూలై 17న ఆ ప్రాంతాన్ని సందర్శించడం ప్రారంభిస్తాయి.