ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గురువారం నుండి ప్రారంభమైంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచినా.. అభిమానుల కళ్లు మాత్రం స్కాటిష్ బౌలర్‌పైనే ఉండిపోయాయి. ఆ బౌలర్ హిజాబ్ ధరించి క్రికెట్ ఆడింది.
శ్రీలంకలో 70 మంది ముస్లిం విద్యార్థుల ఫలితాలను పరీక్షల విభాగం వారు నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హిజాబ్ కారణంగా ఫలితాలు నిలిపివేసినట్లు వెల్లడించింది. పరీక్ష సమయంలో చెవులకు హిజాబ్‌లు ధరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
మహిళల దుస్తుల ఎంపికను గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఒక వ్యక్తి ఏం ధరించాలో నిర్దేశించకూడదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన మహిళా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు.
Iran: ఇస్లామిక్ దేశం ఇరాన్‌లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలుసు. అక్కడ హత్యలకు పాల్పడిని, మోసం చేసినా, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి వాటికి మరణశిక్షలు విధిస్తుంటారు. ఇక స్త్రీలు మత పద్ధతులు ఉల్లంఘించినా, హిజాబ్ ధరించకపోయిన శిక్షలు కఠినంగా ఉంటాయి. హిజాబ్ ధరించని కారణంగా అక్కడి మోరాలిటీ పోలిసింగ్ దాడుల్లో 2022లో మహ్సా అమిని అనే యువతిని కొట్టి చంపేశారు. ఈ వివాదం అక్కడ మహిళల్లో, యువతలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. పెద్ద…
Hijab: హిజాబ్ అంశం మరోసారి కర్ణాటకలో వివాదాస్పదం అవుతోంది. గతంలో బీజేపీ ప్రభుత్వం విద్యాలయాల్లో హిజాబ్‌ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. నిన్న సీఎం సిద్ధరామయ్య మైసూరులోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..మహిళలు కావాలంటే హిజాబ్ ధరించవచ్చని అన్నారు. ఈ వ్యాఖ్యలతో విద్యాలయాల్లో కూడా హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి.
Hijab: గతేడాది కర్ణాటకలో హిజాబ్ అంశం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం రాజకీయ విమర్శలకు దారి తీసింది. పాఠశాల్లలో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ, దానిపై అప్పటి బీజేపీ సర్కార్ నిషేధం విధించింది. ఇదే అంశాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది.
Hijab: కర్ణాటక ఎగ్జామ్ అథారిటీ(కేఈఏ) తీసుకువచ్చిన డ్రెస్ కోడ్ విమర్శలకు దారి తీసింది. రిక్రూట్మెంట్ పరీక్షలు రాసే అభ్యర్థులు ఎలాంటి డ్రెస్ కోడ్‌లో హాజరుకావాలో తెలియజేసే మార్గదర్శకాలను ఈ రోజు విడుదల చేసింది. అయితే ఇందులో తలను, చెవులను కప్పిఉంచే వస్త్రాలను, టోపీలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్షల్లో కాపీయింగ్, బ్లూటూత్ డివైసెస్ వాడకుండా పకడ్బందీ చర్యల్లో ఈ నియమావళిని తీసుకువచ్చినట్లు చెప్పింది.
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ(కేఈఏ) రిక్రూట్మెంట్ పరీక్షలు జరిగే సమయంలో అభ్యర్థుల డ్రెస్ కోడ్‌లో కీలక మార్పులు చేసింది. తను పూర్తిగా కప్పేలా టోపీలు లేదా దుస్తులు ధరించిన వారిని పరీక్షా కేంద్రాలకు అనుమతించబోమని చెప్పింది. పరీక్షల్లో బ్లూటూత్ పరికరాలు ఉపయోగించి మోసాలకు పాల్పడే అవకాశం ఉండటంతో ఉద్యోగ నియామక బోర్డులు, కార్పొరేషన్ నియమాక పరీక్షల్లో తలను కప్పి ఉంచే అన్ని రకాల దస్తులను నిషేధించింది.