Iran: హిజాబ్ సరిగా ధరించలేదని మహిళకు 74 కొరడా దెబ్బలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇస్లామిక్ దేశం ఇరాన్‌లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలుసు. అక్కడ హత్యలకు పాల్పడిని, మోసం చేసినా, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి వాటికి మరణశిక్షలు విధిస్తుంటారు. ఇక స్త్రీలు మత పద్ధతులు ఉల్లంఘించినా, హిజాబ్ ధరించకపోయిన శిక్షలు కఠినంగా ఉంటాయి. హిజాబ్ ధరించని కారణంగా అక్కడి మోరాలిటీ పోలిసింగ్ దాడుల్లో 2022లో మహ్సా అమిని అనే యువతిని కొట్టి చంపేశారు. ఈ వివాదం అక్కడ మహిళల్లో, యువతలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. పెద్ద ఎత్తున ఉద్యమం ఎగిసిపడింది.
Also Read
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
ఇదిలా ఉంటే తాజాగా ‘‘ప్రజా నైతికతను ఉల్లంఘించినందుకు’’ ఒక మహిళకు ఇరాన్ అధికారులు 74 కోరడా దెబ్బలను శిక్షగా విధించారు. ఆమె తలపై వస్త్రాన్ని కప్పుకోకపోవడంతో ఈ శిక్ష విధించింది అక్కడి న్యాయవ్యవస్థ. రోయా హెష్మతి అనే మహిళ రాజధాని టెహ్రాన్ లోని రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో అవమానకరంగా కనిపించిందని అక్కడి న్యాయవ్యవస్థ అభియోగాలు మోపింది. ఆమెకు షరియా చట్టం ప్రకారం 74 కొరడా దెబ్బల్ని శిక్షగా విధించింది.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ లోని మహిళలందరూ తమ మెడను, తలను కప్పి ఉంచుకోవాలనే చట్టం ఉంది. 2022 చివర్లో మహ్స అమిని మరణం తర్వాత చాలా మంది మహిళలు హిజాబ్ తీసి విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ నిరసన తెలిపారు. ఆ తర్వాత నుంచి హిజాబ్ విషయంలో ఇరాన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ధిక్కరించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?