Iran Protests : ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఉధృతమయ్యాయి. సెప్టెంబర్ 16న కుర్దిష్ మహిళ మహసా అమీని మృతితో మొదలైన నిరసలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో శనివారం ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు రాష్ట్రానికే మాత్రం పరిమితం కాదని, దేశం మొత్తానికి వర్తిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.
ఇరాన్‌లో హిజాబ్ వ్యవహారం రోజురోజుకు తీవ్రమవుతోంది. హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంగా అరెస్టయి పోలీసుల కస్టడీలో మరణించిన మహ్సా అమిని ఉదంతంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి.
Ban On Women In Advertisements Iran: ఇస్లామిక్ దేశాల్లో మహిళలపై చాలా ఆంక్షలు ఉంటాయి. స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి ఉంటుంది. మహిళలు బయటకు వెళ్లాలంటే.. భర్తో లేకపోతే సోదరుడో తప్పని సరిగా ఉండాలనే రూల్స్ కూడా కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ లో ఉన్నాయి. ఇక ఉద్యోగం చేయడం, డ్రైవింగ్ చేయడం వంటివి ఆ దేశాల్లో నేరాలుగా పరిగణించబడుతున్నాయి. మతచాంధసవాదంతో మహిళల హక్కులను కాలరాస్తున్నారు. మహిళలను ఇప్పటికీ పిల్లలు కనే ఓ యంత్రంగానే చూస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్…
కర్ణాటకలోని జిల్లాలో కుందాపూర్, ఉడుపి, బిందూర్‌లో మొదలైన హిజాబ్ వివాదం.. క్రమంగా మిగతా ప్రాంతాలకు పాకింది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను కూడా తాకింది.. బుర్కా వేసుకొచ్చామన్న కారణంతో కాలేజీ యాజమాన్యం అనుమతించడం లేదంటూ విజయవాడలోని లయోలా కాలేజీలో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.. బుర్కా వేసుకొచ్చారన్న కారణంతో లోపలికి అనుమతించడం లేదంటూ విద్యార్థినులు తెలిపారు.. దీనిపై విద్యార్థినుల కుటుంబసభ్యులు, ముస్లిం పెద్దలు కూడా ఆందోళన చేసిన సంగతి మరువక ముందే.. ఇప్పుడు మరో చోట హిజాబ్…
కర్ణాటకలోని విద్యా సంస్థల్లో మొదలైన హిజాబ్ వ్యవహారం.. మరికొన్ని రాష్ట్రాలకు పాకింది.. ఇప్పుడు తమిళనాడును కూడా తాకింది.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. మధురైలో హిజాబ్ ధరించి వచ్చిన ఓ మహిళను బీజేపీ బూత్ ఏజెంట్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.. హిజాబ్ తొలగించిన తర్వాతే ఆ మహిళ ఓటు వేయాలని.. అప్పుడే ఓటు వేయడానికి అనుమతించాలంటూ బీజేపీ ఏజెంట్ పోలింగ్ బూత్‌లో వీరంగం సృష్టించాడు.. దీంతో, కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా.. డీఎంకే, అన్నాడీఎంకే సహా ఇతర…
హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.. ఇక, ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు కొందరు విద్యార్థులు.. ఆ కేసులో విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ఆసక్తికరమైన వాదనలు జరిగాయి.. కర్ణాటక సర్కార్ తరఫున అడ‍్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ హైకోర్టులో వినిపించిన వాదనలకు ప్రాధాన్యత ఏర్పిడింది.. హిజాబ్ ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదన్న ఆయన.. హిజాబ్ ధరించడాన్ని నిరోధించడం మత స్వేచ్ఛను అడ్డుకున్నట్టు కాదన్నారు. మత స్వేచ్ఛకు హామీనిచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-25ను ఉల్లంఘించినట్టుకాదని…
హిజాబ్ వివాదంపై విచారణను రేపటికి వాయిదా వేసింది కర్ణాటక హైకోర్టు. హిజాబ్ కాంట్రావర్సీపై కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. హిజాబ్ ను అనుమతించాలా లేదా అనేది తేల్చే అంశాన్ని కాలేజీ కమిటీలకు వదిలేయడం ఇల్లీగల్ అన్నారు పిటిషనర్ల తరపు అడ్వోకేట్ దేవదత్ కామత్. కేంద్రీయ విద్యాలయాల్లో కూడా ముస్లిం విద్యార్థినులు తలకు స్కార్ఫ్ కట్టుకునేందుకు అనుమతిస్తోన్న విషయం కోర్టుకు తెలిపారు. కర్ణాటకలో ముస్లిం అమ్మాయిలు కొత్తగా యూనీఫామ్ కావాలని డిమాండ్ చెయ్యడం లేదని, ప్రభుత్వం ఆదేశాల మేరకు…
కర్ణాటకలో హిజాబ్ వ్యవహారం చల్లారడం లేదు. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు నుంచి కర్ణాటకలో తిరిగి స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. అయితే, కర్ణాటకలోని శివమొగ్గ ఊహించని ఓ ఘటన చోటుచేసుకుంది. శివమొగ్గ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న కొందరు ముస్లీం యువతులను ప్రభుత్వ ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. హాజాబ్‌ను తీసివేసి స్కూల్ లోపలికి వెళ్లానని కోరారు. ఉపాధ్యాయుల విన్నపాన్ని యువతులు అంగీకరించలేదు. ఒప్పించే ప్రయత్నం చేశారు.…