Bihar: మనుషులంతా ఒకటే.. అందరూ సమానమే అనే భావన పిల్లలో పెంపొందించడానికి పాఠశాలల్లో యూనిఫారం ధరించాలనే రూల్ పెడతారు. పాఠశాలల్లో కుల మాత వర్ణ విబేధాలు ఉండవు. అందరూ సమానమే. మతపరమైన ఆచారాలను పాటించేందుకు పాఠశాలల్లో అంగీకరించరు. ఈ నేపథ్యంలో తరగతి గదిలో హిజాబ్ ధరించి ఉన్న అమ్మాయిని ఆ హిజాబ్ తొలిగించాల్సిందిగా ఉపాధ్యాయులు సూచించారు. దీనితో ఆ విద్యార్థినీల తల్లిదండ్రులు ఉపాద్యాయులను చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. బిహార్ లోని శేఖ్‌పురా జిల్లా లోని ఓ ప్రభుత్వ పాఠశాల లోని తరగతి గదిలో హిజాబ్ ధరించిన విద్యార్థినీలకు ఆ పాఠశాల ఉపాద్యాయులు తరగతి గదిలో హిజాబ్ తొలిగించాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థినీలు ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసారు. దీనితో ఆయా విద్యార్థినీల కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులను చంపిస్తామని బెదిరించారు.
Read also:Weight Loss : చలికాలంలో సులువుగా బరువు తగ్గాలంటే ఇది తాగాల్సిందే..!
ఈ ఘటన పైన శేఖ్‌పురా డీఈవో ఓంప్రకాశ్ సింగ్ మాట్లాడుతూ.. తరగతి గదిలో హిజాబ్ తొలిగించాల్సిందిగా సూచించినందుకు విద్యార్థినీల కుటుంబసభ్యులు బెదిరించారని జిల్లాలోని చారువా సెకండరీ స్కూలు ప్రిన్సిపాల్ లిఖిత ఫిర్యాదు చేశారని. ఆ ఫిర్యాదులో సంబంధిత విద్యార్థినీల కుటుంబాలవారు పాఠశాలను ముట్టడించి ఆందోళనకు దిగినట్లు పేర్కొన్నారు. అలానే తమ ఆచార వ్యవహారాలకు అడ్డుపడితే పాఠశాలను నడపనీయబోమని.. తలలు నరికేస్తామని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని.. అలానే ఈ విషయం పైన శాఖా పరమైన విచారణ జరిపి.. నివేదిక అందించాలని కోరారని డీఈవో తెలిపారు. అలానే తరగతి గదుల్లో ఎలాంటి ముసుగులను అనుమతించమని.. కాదని బలవంతపు చర్యలకు దిగి ఒత్తిడి చేస్తే చట్టాన్ని ఆశ్రయిస్తామని ప్రిన్సిపాల్ అన్నట్లు డీఈవో పేర్కొన్నారు.