Nitish kumar: నితీష్ కుమార్ బిగ్ ప్లాన్.. కుమారుడికి ‘పెద్ద’ పదవి!
- నితీష్ కుమార్ బిగ్ ప్లాన్
- కుమారుడికి ‘పెద్ద’ పదవి!
- ఖరారు చేసిన ఎన్టీఏ కూటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కుమారుడి రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అది నెరవేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో రాజ్యసభ ఎన్నికల సందడి నడుస్తోంది.
ఈ నేపథ్యంలో బీహార్ నుంచి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జేడీయూ నుంచి రాజ్యసభకు పంపబడటం ఖాయంగా వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే నితీష్ కుమార్ నుంచి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
బీహార్ నుంచి రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ఎన్డీఏ కూటమి దాదాపుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి శివేష్ రామ్, పవన్ సింగ్‌లు బరిలోకి దింపబోతుండగా.. జేడీయూ నుంచి రామ్‌నాథ్ ఠాకూర్, నిశాంత్ కుమార్, ఆర్ఎల్ఎం (రాష్ట్రీయ లోక్ మోర్చా) నుంచి ఉపేంద్ర కుష్వాహా పేర్లను పరిశీలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దల సభలోకి ఎంట్రీతో నిశాంత్ రాజకీయ ప్రవేవం చేయబోతున్నట్లుగా సమాచారం.
రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా ఎన్నికవుతారు. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమి బలంగా ఉంది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని అందుకుంది. 202 స్థానాలు కైవసం చేసుకుంది. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 41 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. అందువల్ల ఎన్డీఏ నాలుగు సీట్లు గెలుచుకోవడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోతే ఎన్డీఏ ఐదవ సీటు కూడా గెలుచుకోవచ్చని అంటున్నారు.
- Tags
- bihar
- bjp
- JDU
- Nishant
- Nishant confirmed
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!