చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు.. రచ్చ చేస్తున్నారు.. పాఠాలు చదివే వయస్సులో మత విధ్వేషాల్లో సమిధలు అవుతున్నారు.. ఇప్పుడు హిజాబ్ వివాదం కర్నాటకలో ప్రారంభమై దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ అంశాన్ని పెద్దది చేయకండి అంటూ వ్యాఖ‍్యానించింది. అయితే, ఇదే సమయంలో.. అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లో మేం మళ్లీ…
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ స్పందించారు. కర్ణాటకలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు అలజడి రేపేలా ఉన్నాయని కమల్ ట్వీట్ చేశారు. అమాయక విద్యార్థుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరుగుతున్న ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకుండా చూసుకోవాలని… తమిళనాడులో ప్రగతిని కోరుకునే వారు ఇటువంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కమల్ హాసన్ తన…
కర్ణాటకలో హిజాబ్ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పలు ప్రాంతాల్లో ముస్లిం విద్యార్థినులు తల, మెడను కప్పి వుంచే స్కార్ఫ్ ధరించి క్లాసులకు హాజరవుతున్నారు. దీనినే హిజాబ్ అంటారు. అయితే హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను కాలేజీల్లోకి అనుమతించడం లేదు. దీనిని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. కాలేజీలో చేరినప్పుడే తమకు ఈ విషయాలు చెప్పి ఉండాల్సిందని.. కానీ చెప్పకుండా ఇప్పుడు అనుమతించకపోవడం సరికాదని విద్యార్థులు మండిపడుతున్నారు. నిరసనలు వ్యక్తం చేసినా ప్రయోజనం లేకపోవడంతో క్లాసులకు హాజరుకాకుండా నిరాశగా వెనుతిరుగుతున్నారు.…