Iran: ఇరాన్ లోని మత ప్రభుత్వానికి మరో యువతి ప్రాణం బలైంది. గతేడాది హిజాబ్ ధరించలేదని మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిపై అక్కడి మోరాలిటీ పోలీసులు దాడి చేయగా ఆమె మరణించింది. ఇది ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి ఊపిరి పోసింది. దేశంలో పెద్ద ఎత్తన హిజాబ్ వ్యతిరేక నిరసనలు, అల్లర్లు చెలరేగాయి. ఈ ఉద్యమంలో 500 మందికి పైగా మరణించారు. అయితే అక్కడి ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసింది.
Iran: ఇరాన్ దేశం పూర్తిగా మతపాలనపై ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ చట్టాలు ఎక్కువగా పాటిస్తుంటారు. ముఖ్యంగా మహిళల వస్త్రధారణ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా మహిళలు హిజాబ్ నియమాలను ఉల్లంఘిస్తే శిక్షలు దారుణంగా ఉంటాయి. తాజాగా హిజాబ్ చట్టాలను ఉల్లంఘించినందుకు దేశంలోని 12 మంది మహిళా నటులపై నిషేధాన్ని విధించింది అక్కడి ప్రభుత్వం. సినిమాల్లో నటించకుండా వీరందరిపై బ్యాన్ విధించింది.
Hijab: గతేడాది కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్ అంశం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. విద్యాలయాల్లోకి హిజాబ్ లేదా ఇతర మతపరమైన దుస్తులు ధరించి రావడాన్ని కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ చేసింది. కర్ణాటక హైకోర్టు కూడా ఇదే అంశాన్ని పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం మతపరమైన భావాలను అణిచివేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.
Iran: ఇరాన్ దేశం పూర్తిగా మతాచారాలపై ఆధారపడిన రాజ్యం. అక్కడ అందరు విధిగా మత చట్టాను పాటించాల్సిందే. ముఖ్యంగా మహిళ హిజాబ్ అంశంపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. గతేడాది హిజాబ్ సరిగా ధరించలేదని చెబుతూ.. కుర్దిష్ మహిళ మహ్సా అమినిని ఇరాన్ మొరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె మరణించింది. అమిని మరణం ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి నాంది పలికింది.
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్ బోర్డు పరీక్షలో తమ స్కూలు టాపర్‌ల పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ముస్లింలు కాని కొంతమంది గర్ల్స్ స్కార్ప్స్ కట్టుకుని కనిపించారు. దీంతో పాఠశాలలో బాలికలందరినీ హిజాబ్ ధరించమని స్కూల్ యాజమాన్యం బలవంతం చేశారని ఆరోపించారు.
Woman In Hijab Harassed: మహారాష్ట్ర ఔరంగాబాద్ దుర్మార్గమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హిజాబ్ ధరించిన ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు వేధింపులకు గురి చేశారు. సదరు అమ్మాయి హిందూ యువకుడితో తిరుగుతోందని అనుమానించిన వ్యక్తులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ గా మారడంతో పోలీసులు ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఔరంగాబాద్ నగరంలోని బేగంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మకై గేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హిజాబ్ ధరించడం కోసం అల్లరి మూకలతో ధైర్యంగా పోరాడి సోషల్ మీడియాతో పాటు అన్ని చోట్లా వైరల్ అయిన ఓ విద్యార్థిని ఇప్పుడు ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో సత్తా చాటింది. ఏకంగా టాపర్ గా నిలవడంతో పాటు చదువు కోసం తాను చేసిన పోరాటం వృథా కాలేదని నిరూపించింది. కర్ణాటకలో క్లాస్ 12 ఫలితాల్ని తాజాగా బోర్డు ప్రకటించింది. ఇందులో 600 మార్కులకు గానూ ఏకంగా 593 మార్కులు సాధించి సదరు హిజాబ్ బాలిక తబస్సుమ్ టాపర్…
Iran: ఇరాన్ దేశంలో ముస్లిం మతాచారాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసు. ముఖ్యంగా హిజాబ్ అంశంలో ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. గతేడాది మహ్సా అమిని అనే మహిళ హిజాబ్ సరిగ్గా ధరించని కారణంగా ఇరాన్ మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరువాత ఆ అమ్మాయి చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు, యువత ప్రభుత్వానికి, హిజాబ్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేశారు. మహిళలు హిజాబ్ తీసివేసి, జట్టు కత్తిరించుకుని నిరసన తెలిపారు.
Iran: ఇరాన్ దేశంలో ఇస్లామిక్ ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలిసిందే. గతేడాది హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ ఆ దేశ మోరాలిటీ పోలీసులు మహ్సాఅమిని అనే యువతిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఉద్యమమే జరిగింది. ఇరాన్ మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కత్తిరించుకుని, హిజాబ్ విసిరేస్తూ నిరసన తెలిపారు. దాదాపుగా గతేడాది చివరి వరకు ఈ అల్లర్లు అలాగే కొనసాగాయి. ప్రభుత్వం ఈ ఉద్యమంలో పాల్గొన్నవారిని గుర్తించి…
Pakistan: పాకిస్తాన్ మరో ఆఫ్ఘనిస్తాన్ గా మారుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కో ఎడ్యుకేషన్ విద్యా సంస్థల్లో మహిళా ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థినులు తప్పకుండా హిజాబ్ ధరించి రావాాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై అక్కడి మీడియా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని నోటిఫికేషన్ లో పేర్కొంది.