అగ్నేయ బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో విపత్తుల శాఖ కమిషనర్ ఏపీకి పలు సూచనలు జారీ చేశారు. అల్పపీడనం కారణంగా ఎల్లుండి దక్షిణ కోసా, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉందని, తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రేపు రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు.…
ఇప్పటికే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షా లకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. తాజాగా వాతవారణ శాఖ తెలంగాణకు సైతం వర్షం ముప్పు ఉందని పేర్కొంది. తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కిందిస్థాయి నుంచి వీస్తున్న గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని, అలాగే బంగాళ ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఈనెల…
కేరళలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆది వారం ఉదయం రాష్ట్రంలోని వివిధ డ్యామ్‌లలో నీటిమట్టాలు రెడ్ అలర్ట్ స్థాయికి చేరుకున్నాయి. పతనంతిట్ట, కొల్లాం జిల్లాల్లోనూ పలు రహదారులు నీట మునిగాయి. తమిళనాడు ప్రభుత్వం తెలిపిన వివరా ల ప్రకారం ఈరోజు ఉదయం ముల్లపెరియార్ డ్యాంలో నీటి మట్టం 140 అడుగులకు చేరుకుందని ఇడుక్కి జిల్లా యంత్రాం గం తెలిపిం ది. జిల్లాలో వర్షాలు ఇలాగే కొనసాగితే ఇడుక్కి రిజర్వాయర్ చెరుతోని డ్యామ్ షట్టర్లను…
జోరున పడుతున్న వానలతో ఉత్తరాంధ్రలోని రిజర్వాయర్లు నిండిపోయాయి. విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది.. ఎప్పుడు ఏమౌతుందో అని ప్రజల్లో ఆందోళన నెలకొంది. గంట్యాడ మండలం గోస్తనీ నదిపై తాటిపూడి వద్ద నిర్మించిన రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. విశాఖ ఏజెన్సీ అరకు అనంతగిరి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువకు నీరు వచ్చి చేరడంతో తాటిపూడి రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 297 అడుగులు కాగా గరిష్ట…
కుండపోత వర్షంతో తిరుమల కొండకు వెళ్లే దారి మూతపడింది. ఉప్పెనలా పొంగిన వరదలతో కాలినడను కూడా భక్తుడు శ్రీవారి సన్నిధికి చేరే వీలులేకుండా పోయింది. ఆర్టీసీ బస్సులను నిలిపేయడంతోపాటు, రెండు ఘాట్ రోడ్లను మూసేయాల్సి వచ్చింది.తిరుమల కొండపై కురిసిన భారీ వర్షాలకు వరద నీరు మెట్ల మార్గంలో కిందకు పారుతోంది. దీంతో భక్తులు కొండపైకి ఎక్కలేని పరిస్థితి నెలకొంది. కొండ కిందే ఉన్న కపిలతీర్థంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొండ పైనుంచి ఉధృతంగా నీరు కిందకు…
అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రకాశం జిల్లా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రకాశం జిల్లా కొత్త పట్నంలో సముద్ర తీరం 15 మీటర్లు ముందు కొచ్చింది. దీంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుం టున్నారు. ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న 11 మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో చినగంజాం, సింగరా యకొండ, వేటపాలెం, కందూకూరు…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి… ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా.. బలమైన ఈదురు గాలులు కూడా ఇబ్బంది పెడుతున్నాయి.. ఏపీలోని తీర ప్రాంతాల్లో కూడా గంటకు 50-60 కిలోమీటర్ల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు… అత్యవసరమైతే…
ఒకవైపు వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలతో తిరుమల వెళ్ళే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. గురువారం రాత్రి 8 గంటలకు రెండు ఘాట్ రోడ్ల మూసివేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ. తిరిగి రేపు ఉదయం 6 గంటల నుంచి వాహనాలను ఘాట్ రోడ్డు లో అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఘాట్ రోడ్డులో పలు ప్రాంతాలు కొండచరియలు విరిగిపడుతుండడంతో ముందస్తు జాగ్రత్తగా మొదటి ఘాట్ రోడ్డు మూసివేస్తోంది టీటీడీ. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే భక్తులు 7 గంటలలోపు ప్రయాణం చెయ్యాలని విజ్ఞప్తి…
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ముంచె త్తుతుంది. నేడు తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలె వరూ ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక తుఫాన్ కొద్ది సేపట్లో తమిళ నాడులోని కరైకల్, ఏపీలోని శ్రీహరి కోట వద్ద ఉన్న కడలూరులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.…
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో వర్షాలు బీభత్సానికి భారీ వృక్షాలు నెలకొరిగాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వానలు భారీ కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూడూరు, పంబలేరు వాగుకు భారీగా వర్షపు నీరు వచ్చిచేరుతోంది. ఈ క్రమంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. విజయవాడ-చైన్నై జాతీయ రహదారిపై రాకపోకలకు కూడా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.…