కడప జిల్లా బద్వేల్ లో భారీ వర్షం కురుస్తోంది.. ఇవాళ వేకువ జాము నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. దీంతో బద్వేల్ పోలింగ్ పై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే… వర్షం లో నైనా పోలింగ్ సామాగ్రిని తీసుకెళుతుంది ఎన్నికల సిబ్బంది. ఎన్నికల సామాగ్రి తడవకుండా ఎన్నికల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షంలోనైనా… తమ డ్యూటీ ని సక్రమంగా నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే.. రేపు కూడా వర్షం బాగా పడితే.. పోలింగ్ శాతం తగ్గే…
తిరుపతిలో అర్థరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వెస్ట్ చర్చ్ సమీపంలో ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద వాహనం నీట మునిగింది. దీంతో కర్ణాటకకు చెందిన ఏడుగురు భక్తులు వరద నీటిలో చిక్కుకున్నారు. అతికష్టం మీద ఆరుగురు వ్యక్తులు బయటపడ్డారు. కానీ సంధ్య అనే మహిళ ఊపిరాడక మృతి చెందింది. వీరితో పాటు ప్రయాణిస్తున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వాహనం వదిలి డ్రైవర్ పరారైనట్లు సమాచారం. ఇప్పటికే వాతావరణ శాఖ…
రాగల 24 గంటల్లో ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు తిరోగమనం పట్టడంతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత రెండు రోజుల నుంచి ఏపీలో ఎండ తీవ్రతతో పలు చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉరుములు, మెరుపులతో కూడిన…
ఎగువ నుంచి భారీ వరద నీరు రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇప్పటికే అధికారులు 2 క్రస్ట్ గేట్ల ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 67,378 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 70,836 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిలువ 310.8498 టీఎంసీలుగా ఉంది. ఇదిలా ఉంటే.. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గుముఖం…
కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శబరిమల పుణ్యక్షేత్రం, అయ్యప్ప జన్మస్థలమైన పందళం, అచ్చన్‌కోవిల్ వంటి ముఖ్యమైన సందర్శక ప్రదేశాలున్న పతనంతిట్ట జిల్లాతోపాటు.. దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ఇడుక్కి జిల్లా, అటు తమిళనాడులోని త్రిషూర్ జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. పంపానదిపై ఉన్న కక్కి డ్యామ్ వద్ద వరద ఉధృతి పెరుగుతుండడంతో నీటిని కిందకు వదలాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల పంపాబేస్ వద్ద నది ఉప్పొంగనుంది. డ్యామ్ తెరిస్తే శబరి…
రానున్న మూడు రోజులు 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో… రానున్న రెండు మూడు రోజుల్లో వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిస్తాయని తెలిపింది. అక్టోబరు 18 నుంచి 20 మధ్య నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40…
కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. గత రెండు రోజులుగా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నదులు ప్రమాదకరస్థితిలో ప్రవహిస్తుండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. తిరువనంతపురం, కొట్టాయం, పథనం మిట్ట, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, త్రివిధ దళాల సైన్యం…
కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు నగరాల్లో రహదారులు నదులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. కొట్టాయం జిల్లాను వరదలు ముంచెత్తాయి. జిల్లాలో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. వరద ధాటికి… ఇళ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. ఓ ఇల్లు కళ్ల ముందే… కూలిపోయిన దృశ్యాలు… అక్కడి వరద బీభత్సాన్ని కళ్లకు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగబాద్, సిల్వాసా ప్రాంతముల గుండా కొనసాగుతున్నది. రాగల 24 గంటలలో మహారాష్ట్ర, తెలంగాణ లలోని మరికొన్ని ప్రాంతముల నుండి మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతముల నుండి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలు ఉన్నాయి. తూర్పుమధ్య బంగాళాఖాతం & దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము…
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అయితే హిమాయత్ సాగర్ చెరువు, అప్ప చెరువు తదితర ప్రాంతాల పరిస్థితిని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆర్ డీ ఓ రాజేంద్ర నగర్ చంద్రకళ, జీహెచ్ఎమ్సీ, హెచ్ఎమ్ డబ్ల్యూఎస్, ఇరిగేషన్, రెవెన్యూ, ఎన్ హెచ్ఏఐ తదితర శాఖల అధికారులతో కలిసి ఈరోజు స్వయంగా…