ఏపీలో ముఖ్యంగా కడపలో భారీ భార్షలు కురుస్తున్న విషయం తెలిసిందే. దాంతో అక్కడ ప్రజలు ఎవరు ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అయితే రేపు ఆ జిల్లా మీదుగా నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేయగా…పలు రైళ్లు దారి మళ్లించారు. చెన్నై, తిరుపతి నుండి కడప మీదుగా నడిచే రైళ్లు రేపు రద్దు చేసారు. రేణిగుంట -గుంతకల్లు, గుంతకల్లు -రేణిగుంట మధ్య నడిచే ప్యాసింజర్ రైలు.. కడప -విశాఖపట్నం, విశాఖపట్నం -కడప మధ్య…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపూర్ పర్యటన వాయిదా పడింది. ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమైపోయిందని, నరసాపురం సభ వాయిదా వేస్తున్నట్టు జనసేన పార్టీ వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21వ తేదీన జనసేన పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ వాయిదాపడింది. ఈ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమైపోయి, ప్రాణ నష్టం, పంట…
చైన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురి శాయి. బంగాళఖాతంలో గంటకు 18.కీ.మీ వేగంతో కదులుతున్న వాయుగుండం. పుదుచ్చేరి చైన్నై మధ్య తీరం దాటిందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని అధి కారులు సూచించారు. దీనిప్రభావంతో తమిళనాడు, ప్రకాశం చిత్తూరు, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిత్తూరుకు తప్పని…
భారీవర్షాల కారణంగా తిరుమలకు రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు ఇఓ జవహర్ రెడ్డి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సోషల్ మీడియా సమాచారం విశ్వసించవద్దని, వర్షం వల్ల దర్శనానికి రాలేకపోతే.. తర్వాత దర్శించుకునే అవకాశం ఇస్తామన్నారు జవహర్ రెడ్డి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తిరుమలలో భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తిరుపతిలో భక్తులకు వసతి సౌకర్యం కల్పించామని, వర్షం కారణంగా దర్శనానికి రాలేని భక్తులను తరువాత రోజులలో దర్శనానికి…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి రోడ్లపై వరద నీరు వచ్చిచేరుతోంది. అయితే కడప జిల్లా రాజంపేటలోని చెయ్యేరు నది కట్ట తేగిపోవడంతో ఒక్కసారి రోడ్లపై వరద నీరు వచ్చింది. దీంతో రోడ్డుపై ఉన్న రెండు ఆర్టీసీ బస్సులు ముందుకు కదలలేక వరద నీటిలోనే నిలిచిపోయాయి. వరద నీరు బస్సులోకి చేరడంతో ప్రయానికులు…
ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెల్పింది. వాయుగుండంపై బులెటిన్ విడుదల చేసింది ఐఎండీ. చెన్నైకి ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇవాళ ఉత్తర తమిళనాడు..దక్షిణ కోస్తా మధ్య చెన్నై-పుదుచ్చేరి దగ్గర తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ…
ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువుల పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయచర్యలు చేపట్టారు. అంతేకాకుండా తక్షణ సహాయంగా రూ.1000 వెయ్యి చొప్పున సీఎం జగన్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం 3-4 గంటల మధ్య చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరాన్ని దాటింది. భారీ వర్షాలతో కళ్యాణి జలాశయం నిండుకుండాలా మారింది. పూర్తిస్థాయి…
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి- చెన్నై సమీపంలో తీరం దాటింది. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఈరోజు రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతారవణ శాఖ తెలియజేసింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతారవణ శాఖ…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీలో ప్రభావం చూపుతోంది. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతిలో సైతం వర్షాలతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు సహాయచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాల కారణంగా శ్రీవారి దర్శనానికి తిరుమలకు రాలేకపోతున్న భక్తులకు ఊరట కలిగించే విషయాన్ని తెలిపింది.…