భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయని… తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు సీఎం జగన్. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని… ముఖ్యంగా…
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి… గంటకు 27 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం.. చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది.. కారైకాల్ – శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తుండగా.. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలపై…
వాయుగుండం ప్రభావంతో తమిళనాడు సర్కార్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది.. చెన్నై నగరంలో ఉన్న అన్ని సబ్వేలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. మరో రెండు రోజులపాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.. ప్రజలు ఎవరు బయటికి రావొద్దని సూచించారు. ఇక, లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు అధికారులు.. కాగా,…
రెండు తెలుగు రాష్ట్రాలకు మరో సారి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. శ్రీలంక దగ్గర్లోని కొమరీన్ ఏరియాలో అల్పపీడనం కొనసాగుతోంది. 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే 2 రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏపీలోనూ రానున్న 24…
వర్షాలు, వరదలతో చెన్నై ప్రజలు అల్లాడిపోతున్నారు. నేనున్నాను.. మీకేం కాదంటూ సీఎం స్టాలిన్ అభయం ఇస్తున్నారు. వరదల్లో చిక్కుకున్నవారిని పలకరిస్తూనే వరద నీటిలోనే ఆయన ముందుకుసాగుతున్నారు.
భారీ వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు సీఎం. చెన్నై సిటీలోని పలు ప్రాంతాలతో పాటు సబర్బన్ ఏరియాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఎలక్ట్రిసిటీ లోకల్ ట్రైన్స్ రద్దు చేసింది రైల్వే శాఖ. చెన్నై సిటీకి తాగునీటిని అందిస్తున్న చెంబరబాక్కం, పుజల్ రిజర్వాయర్ గేట్లు తెరిచారు. వరద ప్రవాహం పెరగడంతో పుజల్ డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో నీరు పరవళ్ళు తొక్కుతోంది.…
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా వుండాలని సూచించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించింది. క్రమేపీ అది బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని, దీని…
అమరావతి : ఏపీకి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ నెల 9 మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి పశ్చిమ బంగాళాఖాతం దగ్గరలో ఉత్తర తమిళ్ నాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటుని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు ఉత్తర…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ పేర్కొంది. ప్రస్తుతం అల్పపీడనం తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 km ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది. రాగల 3-4 రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశలో నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉంది. పైన తెలిపిన అల్పపీడనంనకు అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర కోస్తా…
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు.. నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరగా కేంద్రీకృతమైందని.. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా వాయువ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించిందని వెల్లడించిన ఐఎండీ.. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఓ…