కేరళలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆది వారం ఉదయం రాష్ట్రంలోని వివిధ డ్యామ్‌లలో నీటిమట్టాలు రెడ్ అలర్ట్ స్థాయికి చేరుకున్నాయి. పతనంతిట్ట, కొల్లాం జిల్లాల్లోనూ పలు రహదారులు నీట మునిగాయి. తమిళనాడు ప్రభుత్వం తెలిపిన వివరా ల ప్రకారం ఈరోజు ఉదయం ముల్లపెరియార్ డ్యాంలో నీటి మట్టం 140 అడుగులకు చేరుకుందని ఇడుక్కి జిల్లా యంత్రాం గం తెలిపిం ది. జిల్లాలో వర్షాలు ఇలాగే కొనసాగితే ఇడుక్కి రిజర్వాయర్ చెరుతోని డ్యామ్ షట్టర్లను ఆదివారం తెరుస్తామని ఇడుక్కి జిల్లా కలెక్టర్ షీబా జార్జ్ తెలిపారు. సాధారణ స్థాయిని మించి నీటి మట్టాలు పెరగడంతో అధికారులు ఆయా డ్యాం గేట్లను ఎత్తి వేశారు. దీంతో పలు రహదారులు నీట మునిగాయి.
భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ ప్రకారం కేరళలోని ఆరు జిల్లాల్లో ఆది, సోమవారాలు భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉంది. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టా యం, ఇడుక్కిలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేయగా, నవం బర్ 14న పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి లలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఈ వర్షా లు మరో రెండు రోజుల పాటు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికా రులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం సూచించింది.