అగ్నేయ బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో విపత్తుల శాఖ కమిషనర్ ఏపీకి పలు సూచనలు జారీ చేశారు. అల్పపీడనం కారణంగా ఎల్లుండి దక్షిణ కోసా, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉందని, తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
రేపు రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలం పనులు చేసుకునే రైతులు జాగ్రతలు తీసుకోవాలన్నారు.