Telangana Rains: తెలంగాణకు తొలకరి పలుకరించింది. రుతుపవనాలు తెలంగాణలోని పలు ప్రాంతాలను మొదటిసారిగా తాకడంతో నగరంలో బుధవారం చినుకులు, కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి.
Assam Floods: ఈశాన్య రాష్ట్రం అస్సాం వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ బ్రహ్మపుత్ర నదితో పాటు ఇతర నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా జిల్లాలో వరద భీభత్సం సృష్టిస్తోంది. బుధవారం అస్సాంలో పరిస్థితి మరింత దిగజారింది.
రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.. ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలు ఒకటి లేదా రేడు చోట్ల కురిసే ఛాన్స్ ఉండగా.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించనున్నాయి.. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల…
ఎండల నుంచి ఉపశమనం లభిస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. మంగళవారం నాటికి నైరుతి రుతుపవనాలు రాయలసీమ, దక్షిణాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు, నెల్లూరు జిల్లా కావలి వరకు విస్తరించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బీఆర్ అంబేద్కర్ తెలిపారు
నేపాల్‌లో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తోంది. నేపాల్ తూర్పు ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని కొనసాగిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా సంభవించిన విపత్తులో పలువురు మరణించగా, డజన్ల కొద్దీ తప్పిపోయినట్లు సమాచారం.
Chennai: రికార్డు స్థాయి ఎండల తర్వాత చెన్నై ప్రజలకు ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Pakistan Rains: పొరుగుదేశం పాకిస్తాన్లో శనివారం కుండపోత వర్షాల కారణంగా 25 మంది మరణించగా, 145 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపార్జాయ్’ తుఫాన్ రానున్న 12 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం తెలిపింది. గుజరాత్ లోని పోర్‌బందర్ తీరానికి 200-300 కి.మీ దూరంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే ఐదురోజులు గుజరాత్ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు, బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.