Rain Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది.
భారత దేశంలో ఎటు చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పలు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు జనాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. కర్ణాటక లో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రమంతా వరదలతో నిండిపోయింది.. ఎటు చూసిన నీళ్లు ఉండటంతో జనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి..మరో ఐదు రోజుల పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని…
నైరుతి రుతుపవనాల నేపథ్యంలో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని 2 జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 10 జిలా్లలకు ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. కేరళ, కర్ణాటక రాష్ర్టాల్లోని తీర ప్రాంతాల్లో రానున్న 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు.
నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముంబయిలో అయితే వర్షాలు ఆగకుండా కురుస్తూనే ఉన్నాయి.
ఈ వారం ప్రారంభంలో రుతుపవనాలు వచ్చినందున ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గురువారం వర్షం, మేఘావృతమైన ఆకాశం కనిపించింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 23.5 డిగ్రీల సెల్సియస్ కాగా.. గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
అస్సాంలో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరదలు సంభవించాయి. వివిధ ప్రాంతాలలో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాకుండా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని రోజువారీ వరద నివేదిక ధృవీకరించింది.
దేశంలో రాగల రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతా వరణ శాఖ ప్రకటించింది. భరీ వర్షాల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు హైఅలర్ట్ ను ప్రకటించింది.