Formers: తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసిపోయాయి. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Heavy rain: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు భగభగలతో అల్లాడిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి సూర్యని వేడితో అల్లాడుతున్న నగరవాసులకు చిరు జల్లులతో పలుకరించింది.
బెంగళూరులో గత రెండు రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో ఈ వర్షాల దెబ్బకు జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా వరద నీరు కారణంగా ఓ బంగారు షాపులోని ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ యజమాని తీవ్రంగా నష్టపోయాడు.
Bengaluru Rains: బెంగళూర్ నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరాయి. అండర్ పాస్ లు అన్ని నీట మునిగాయి. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. ఇదిలా ఉంటే బెంగళూర్ వర్షానికి ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లాకు చెందిన భానురేఖ(22) అనే యువతి మరణించింది.
Cyclone Mocha: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోచా తుఫాన్’ భారతదేశాన్ని ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా ఒడిశాతో పాటు తూర్పు కోస్తా ప్రాంతాలపై ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) హెచ్చరించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మోచా తుఫాన్ దిశ మార్చుకుని, మయన్మార్(బర్మా) వైపు కదులుతోంది. ఇది గంటకు 148 కిలోమీటర్ వేగంతో ‘ చాలా తీవ్రమైన తుఫాన్’గా మారే అవకాశం ఉంది.
ఆఫ్రికా దేశమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోల వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్నిరోజులుగా కుంభవృష్టిగా కురుస్తున్న వానలతో దక్షిణ కివు ప్రావిన్స్‌లో నదులకు వరదలు పోటెత్తాయి. దీంతో బుషుషు, న్యాముకుబి వంటి గ్రామాలను నదులు ముంచెత్తాయి.