రానున్న మూడు రోజుల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ హిమాలయ ప్రాంతం, మధ్యప్రదేశ్‌లో మే 3 వరకు భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
Rain: హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఈ ఘటనలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందాడు.
మిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, ఈరోడ్ సహా 15 జిల్లాల్లో రేపు (ఏప్రిల్ 23) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు (ఏప్రిల్ 22) తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. నగర శివార్లలోని దేవనహళ్లిలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేవనహళ్లిలోని కేఐఏలో మంగళవారం సాయంత్రం 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సీఎం కేసీఆర్ నేడు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వానతో పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు.