Pakistan Rains: పొరుగుదేశం పాకిస్తాన్లో శనివారం కుండపోత వర్షాల కారణంగా 25 మంది మరణించగా, 145 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో వర్షం కురిసింది. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించినట్లు మీడియా తెలిపింది. ఈ భారీ వర్షం కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వర్షం కారణంగా చాలా ఇళ్లు కూలిపోయాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ, లక్కీ మార్వాట్, కరక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని సీనియర్ రెస్క్యూ ఆఫీసర్ ఖతీర్ అహ్మద్ తెలిపారు. దీంతో పాటు ఇక్కడ వడగళ్ల వాన కూడా కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక చెట్లు నేలకూలాయని తెలిపారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. క్షతగాత్రులకు తక్షణ సాయం అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని అహ్మద్ తెలిపారు.
Dangerous Driving in heavy Rain. pic.twitter.com/VsMNUSwuyr
— Beautiful Pakistan🇵🇰 (@LandofPakistan) June 3, 2023
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
వర్షాల కారణంగా జరిగిన ప్రాణనష్టంపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ శనివారం విచారం వ్యక్తం చేశారు.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల దృష్ట్యా, పాకిస్తాన్ సైన్యం నిరంతరం ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను కాపాడుతోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also:Kerala News: కాలేజీలో లెక్చరర్ ఫోన్ తీసుకుందని యువతి ఆత్మహత్య
గతేడాది 1700 మందికి పైగా మృతి
గత ఏడాది కూడా పాకిస్తాన్‌లో వర్షాలు, వరదలు విధ్వంసం సృష్టించాయి. 1700 మందికి పైగా మరణించారు, వందల మంది గాయపడ్డారు. వర్షాలు, వరదల కారణంగా 33 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 8 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి మొదలైంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. దాని పైన ఈ వర్షం మరొక దెబ్బ కొడుతోంది.
#Pakistan Army relief operation is still underway at Bannu, Khyber Pakhtunkhwa, where the heavy rain & storm destroyed everything, took 12 precious lives. pic.twitter.com/ez3tuIGgLl
— FALCON TALON 🇵🇰 (@fpa31) June 10, 2023
Read Also:Varuntej and Lavanya Tripathi: వరుణ్-లావణ్యల పెళ్లి ఇటలీలోనా?
పిఎం షాబాజ్ సూచనలు
అరేబియా సముద్రంలో వచ్చే బిపార్జోయ్ తుఫాను ముందు అత్యవసర చర్యలు తీసుకోవాలని ప్రధాని షాబాజ్ అధికారులను ఆదేశించారు. తుపాను దృష్ట్యా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పాకిస్థాన్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుఫాను జూన్ 15 నాటికి పాకిస్థాన్‌ను తాకే అవకాశం ఉంది.