The Lancet Report:దేశంలో గుట్టుచప్పుడు కాకుండా బీపీ, షుగర్ తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ది లాన్సెట్ డయాబెటిక్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశ జనాభాలో 11.4 శాతం మంది షుగర్ తో బాధపడుతున్నారు.
మీరు తరచుగా తలనొప్పిని కలిగి ఉన్నట్లయితే, అది భయానకంగా ఉంటుంది. నొప్పి కొనసాగితే లేదా పునరావృతమైతే, ఇది బ్రెయిన్ ట్యూమర్ వంటి తీవ్రమైన సమస్య అని మీరు భావించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
అండర్ ఆర్మ్ చెమటను తగ్గించేందుకు ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండటం చాలా చాలా అవసరం. దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి మీ అండర్ ఆర్మ్స్ ను యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో క్రమం తప్పకుండా కడగండి. అంతేకాకుండా స్నానం చేసిన తర్వాత మీ చంకలను బాగా ఆరబెట్టుకోవాలి. మరోవైపు డియోడరెంట్ల కంటే యాంటిపెర్స్పిరెంట్లను ఎంచుకోవడం మంచిది.
Heart Attack: ఇటీవల కాలంలో మూడు పదులు వయసులోపు యువత గుండెపోటు బారిన పడటం చూస్తున్నాం. అంతా ఫిట్ గా ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నా.. హఠాత్తుగా వచ్చే విపత్తును గుర్తించలేకపోతున్నారు. ఇటీవల ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ గుజరాత్ లోని జామ్ నగర్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. గుండె వ్యాధుల నిపుణుడైన డాక్టరే తనకు వచ్చే గుండెపోటును గుర్తించలేెపోయారు. మంగళవారం ఉదయం ఆయన మరణించారు.
బీట్ రూట్ తో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా మధుమేహం, క్యాన్సర్, బిపి, థైరాయిడ్ లాంటి సమస్యలు మనుషుల్లో అధికమవుతున్నాయి. అంతే కాకుండా ఎక్కువగా ప్రజలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీన్నుంచి బయటపడాలంటే ఒక్కటే దారి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక పదార్థం తీసుకోవడం ద్వారా బయటపడొచ్చు అదేనండి బీట్ రూట్.
ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో బిస్ఫెనాల్ ఎ అనే రసాయన సమ్మేళనాన్ని వినియోగిస్తారు. పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తయారీకి బీపీఏను ఉపయోగించడం వల్ల.. క్యాన్సర్, హార్మోన్ల సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
ఈ రోజుల్లో అశ్వగంధాన్ని అందరూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారు తరుచుగా వాడుతుంటారు. ముఖానికి గానీ, శరీరానికి గానీ దీన్ని వాడుతుంటారు. అశ్వగంధం అనేది ఎన్నో ఏండ్ల నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో మేలు చేసే లక్షణాలు ఉన్నాయి. అశ్వగంధ శారీరక, మానసిక సమస్యలను తగ్గిస్తుంది. అశ్వగంధను తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గిపోతాయి.
మీరు ప్లాస్టిక్ వాడుతున్నారా.. చాలా డేంజర్ గురూ.. ప్లాస్టిక్ బాక్స్ ల్లో ఫుడ్, ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్, ప్లాస్టిక్ కవర్స్ లో ఇతరత్రా వస్తువులు తీసుకుని వెళ్తున్నారా.. ప్రమాదం బారిన పడినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ వాడొద్దని నిపుణులు చెబుతున్నప్పటికీ జనాలు పెడచెవిన పెడుతున్నారు. అసలు ప్లాస్టిక్ వాడితే ఆరోగ్యానికి హానికరమని కొంతమందికి ఇంకా తెలియదు.
మనం తినే పండ్లు గానీ, కూరగాయలు గానీ ఫ్రెష్ గా నీటిలో కడుక్కొని తింటాం. తినేముందు వాటిపై ఉన్న తొక్కలను వేరు చేసి లోపల ఉన్న పదార్థాన్ని తింటాం. అయితే తినే పండులోపల కన్నా.. తొక్కతోనే ఎక్కువ లాభాలున్నాయంటున్నారు. నిజానికి ఈ తొక్కల్లోనే మానవుడికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి తెలుసా..? కొందరు తెలిసిన వారు తొక్కలు కూడా తింటారు.