Health: ఆయుర్వేద మూలికలు ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఆయుర్వేద మూలికలను కొందరు వాడుతుంటారు. ఎక్కువగా ట్రైబల్ ఏరియాలోని జనాలు వాటినే ఎక్కువగా వాడుతారు. ఆయుర్వేద మూలికల్లో ఎక్కువగా ఉపయోగించేది, ముఖ్యమైనది ఒకటి అశ్వగంధం. దానిలో మానవుని శరీరానికి సంబంధించి కొన్ని మేలు చేసే ప్రయోజనాలు ఉన్నాయి.
Read Also: Rava Uttapam : రవ్వ ఊతప్పంను ఇలా చేస్తే.. చాలా రుచిగా ఉంటుంది..
ఈ రోజుల్లో అశ్వగంధాన్ని అందరూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారు తరుచుగా వాడుతుంటారు. ముఖానికి గానీ, శరీరానికి గానీ దీన్ని వాడుతుంటారు. అశ్వగంధం అనేది ఎన్నో ఏండ్ల నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో మేలు చేసే లక్షణాలు ఉన్నాయి. అశ్వగంధ శారీరక, మానసిక సమస్యలను తగ్గిస్తుంది. అశ్వగంధను తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇది సహజ అడాప్టోజెన్ గా పనిచేస్తుంది. ఒత్తిడి ఉంటే అశ్వగంధను తీసుకోండి. ఇది మీకు మంచి విశ్రాంతినిస్తుంది.
Read Also: Adipurush Pre Release Event Live Updates : కమ్మేసిన ఆదిపురుష్ మేనియా..
అలాగే అశ్వగంధ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మన జ్ఞాపకశక్తిని, అభిజ్ఞా పనితీరును బాగా మెరుగుపరుస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దెబ్బతిన్న మెదడు కణాలను రిపేర్ చేయడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా పురుషుల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. హార్మోన్లను ఉత్పత్తి చేసే అడ్రినల్ గ్రంథిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మెరుగైన సంతానోత్పత్తి, నియంత్రిత కాలాలు మరియు టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది.
Read Also: Adipurush Pre Release Event: బిగ్ బ్రేకింగ్.. తిరుపతిలో భారీ వర్షం.. అయోధ్య సెట్ కు కవర్
అశ్వగంధ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మన శరీర సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అశ్వగంధ కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ను నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా లైంగిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఇది లిబిడోను బాగా పెంచుతుంది. అంగస్తంభన, శీఘ్రస్ఖలనాన్ని మెరుగుపరుస్తుంది. స్పెర్మ్ కౌంట్ ను కూడా బాగా పెంచుతుంది.